వీకెండ్ రిలీజ్

Wednesday,August 21,2019 - 06:15 by Z_CLU

30న సాహో సినిమా థియేటర్లలోకి వస్తోంది. అది రిలీజైన తర్వాత మరో 2 వారాలు ఇతర సినిమాలేవీ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి సాహో కంటే వారం ముందే కొన్ని సినిమాలు క్యూ కట్టాయి. అలా ఈ వీకెండ్ ఏకంగా 7 సినిమాలు విడుదలవుతున్నాయి

ఐశ్వర్య రాజేశ్, రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలు పోషించిన స్పోర్ట్స్ బేస్డ్ ఎమోషనల్ మూవీ కౌసల్య కృష్ణమూర్తి. భీమనేని శ్రీనివాసరావు డైరక్ట్ చేసిన ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మించారు. ఇప్పటికే ట్రయిలర్ కాస్త క్లిక్ అవ్వడంతో పాటు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు విజయ్ దేవరకొండ లాంటి స్టార్ రావడంతో సినిమాపై ఆడియన్స్ ఫోకస్ పెరిగింది. ఇందులోని ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుందంటోంది యూనిట్.

సీనియర్ నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా పరిచయమౌతున్న సినిమా ఏదైనా జరగొచ్చు. పూజా సోలంకి, సాషా సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రమాకాంత్ దర్శకుడు. కంప్లీట్ హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో బాబీ సిమ్హా నెగెటివ్ రోల్ లో కనిపించాడు.

ఈ సినిమాలతో పాటు బాయ్, హవా, నివాసి, కేడీ నంబర్-1, నీతోనే హాయ్ హాయ్ లాంటి ఇతర సినిమాలు కూడా ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్నాయి.