వరుస హిట్లతో దూసుకెళ్తున్న శేష్

Wednesday,August 21,2019 - 05:52 by Z_CLU

ప్రస్తుతం వరుస సూపర్ హిట్స్ తో అందరి మెప్పు పొందుతున్నాడు అడివి శేష్. ‘క్షణం’ తో సక్సెస్ ఖాతాను తెరిచిన శేష్ ఆ సినిమాతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాడు. చిన్న సినిమాగా విడుదలైన ఆ సినిమాకి ప్రశంసలతో పాటు కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత ‘అమీ తుమీ’ అనే రొమాంటిక్ కామెడీ సినిమా చేసాడు. అది కూడా హిట్టే.

గతేడాది ‘గూఢచారి’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు శేష్. ఎవరూ ఊహించని విధంగా ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. టాలీవుడ్ కి హాలీవుడ్ మేకింగ్ ని పరిచయం చేస్తూ వచ్చిన ఆ సినిమాకు టాలీవుడ్ స్టార్స్ సైతం ఫిదా అయ్యారు. ‘గూఢచారి’తో సూపర్ స్టార్ మహేష్ ను సైతం ఆకర్షించి తన తదుపరి సినిమాకు నిర్మాతగా మార్చేశాడు. ఇక లేటెస్ట్ గా వచ్చిన ‘ఎవరు’ కూడా మంచి థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో సూపర్ హిట్ గా నిలిచింది. రోజురోజుకి కలెక్షన్స్ కూడా ఊపందుకుంటున్నాయి.

క్షణం , అమీ తుమీ, గూఢచారి ఇప్పుడు ఎవరు… ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ అందుకున్నాడు శేష్.  త్వరలోనే ‘మేజర్’,గూఢచారి2′ సినిమాలతో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.