'ఉప్పెన' షూటింగ్ లో విజయ్ సేతుపతి !

Wednesday,August 21,2019 - 07:01 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమా షూటింగ్‌లో బుధవారం నుండి తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి  పాల్గొంటున్నారు. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

సారథి స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్స్ మోనిక, రామకృష్ణ వేసిన భారీ సెట్‌లో ప్రస్తుతం సినిమా చిత్రీకరణను జరపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో వైష్ణవ్ తేజ్, రాజీవ్ కనకాల, హీరోయిన్ క్రితి శెట్టి, అలాగే 500 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 40 శాతం షూటింగ్ పూర్తయింది.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, పతాకాలపై ఈ సినిమా నిర్మితమవుతోంది.