సెకండ్ సింగిల్ తో అదరగొడుతున్న రామ్

Friday,October 06,2017 - 06:20 by Z_CLU

రామ్- కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఉన్నది ఒకటే జిందగీ’ నుంచి సెకండ్ సింగల్ రిలీజ్ అయింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో ‘వాట్ అమ్మ’ అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియా లో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ హల్చల్ చేస్తుంది. ముఖ్యంగా ఈ సాంగ్ లో దేవి వాయిస్ తో పాటు శ్రీమణి అందించిన క్యాచీ లిరిక్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.


ఇప్పటికే ఈ సినిమాలోని ‘ట్రెండు మారినా ఫ్రెండు మారేడే ‘ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ఫెవరెట్ లిస్ట్ లో ప్లేస్ అందుకోగా ఇప్పుడు ఈ సాంగ్ కూడా అదే లిస్ట్ లోకి చేరిపోయింది. త్వరలోనే ఆడియోను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 27 థియేటర్స్ కి రానుంది.