రవితేజ ‘రాజా ది గ్రేట్’ ట్రైలర్ రివ్యూ

Friday,October 06,2017 - 06:04 by Z_CLU

రవితేజ ‘రాజా ది గ్రేట్’  థియేట్రికల్  ట్రైలర్ రిలీజయింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఈ నెల 19 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుండే ఈ సినిమా చుట్టూ క్రియేట్ అయిన హైప్ ని ఈ రోజు రిలీజైన ట్రేలర్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది.

రవితేజ సరసన మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కళ్ళు లేని మన హీరో తను ప్రేమించిన అమ్మాయిని ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ సినిమాలో ఇంటరెస్టింగ్ పాయింట్. ఇక దాంతో పాటు రవితేజ మార్క్ మాస్ ఎనర్జీ, దానికి తోడు పర్ఫెక్ట్ టైమింగ్ లో కామెడీ.. మొత్తానికి ఇప్పటికే మోస్ట్ అవేటెడ్ మూవీ లిస్టులో ఉన్న ఈ సినిమా కంప్లీట్ ఎంటర్టైన్ మెంట్ ప్యాకేజ్ అనిపిస్తుంది.

‘ఎన్ని కళ్ళు నన్ను చూస్తున్నా, ఎంతమంది నావైపొస్తున్నా.. మీరేసే అడుగు, చూసే చూపు, పీల్చే శ్వాస ఎవ్రీ థింగ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్’ అంటూ రవితేజ చెప్పే డైలాగ్ తో మాస్ మహారాజ్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు రవితేజ.

మొత్తం 2 నిమిషాల 10 సెకన్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే బ్రాండెడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అకౌంట్ లో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనిపిస్తుంది. ఈ సినిమాకి సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.