రామ్ చరణ్ సినిమాలో వివేక్ ఒబెరాయ్

Tuesday,January 30,2018 - 02:42 by Z_CLU

ప్రస్తుతం సుకుమార్ ‘రంగస్థలం’ సినిమాతో బిజీగా ఉన్నాడు రామ్  చరణ్. ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ  సినిమా తరవాత ఇమ్మీడియట్ గా బోయపాటి శ్రీను సినిమాతో సెట్స్ పైకి రానున్నాడు రామ్ చరణ్. అయితే ఈ సినిమాలో బాలీవుడ్  నటుడు వివేక్  ఒబెరాయ్  కీ రోల్ ప్లే చేయనున్నాడు.

ఇప్పటికే  ఫస్ట్  షెడ్యూల్  కంప్లీట్  చేసుకున్న  ఈ సినిమా ఫిబ్రవరి 25  నుండి  సెకండ్ షెడ్యూల్  బిగిన్ చేయనుంది.  నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో  రామ్  చరణ్,  వివేక్  ఒబెరాయ్  కాంబినేషన్  లో ఉండబోయే  కీలక సన్నివేశాలను తెరకెక్కించనుంది సినిమా యూనిట్.

D.V.V. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.