రష్మిక మండన్న ఇంటర్వ్యూ

Tuesday,January 30,2018 - 06:35 by Z_CLU

నాగశౌర్య ‘ఛలో’ మూవీ టాలీవుడ్  లో  ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 2 న రిలీజవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రష్మిక మండన్న మీడియాతో చేసిన చిట్ చాట్ మీకోసం…

అలా జరిగింది…

2014 లో డిగ్రీ చదివేటప్పుడు బెంగళూరు లో ఫ్రెష్ ఫేస్ పేజెంట్ ని గెలుచుకున్నాను. ఆ తరవాత నాకు ‘కిరిక్ పార్టీ’ సినిమాలో చాన్స్ వచ్చింది.

 

అందుకే చేశాను….

ఛలో సినిమా విషయానికి వస్తే అన్నింటి కన్నా ముందు నచ్చింది స్టోరీ. ఐరా క్రియేషన్స్ కి కనెక్ట్ అవ్వడానికి ముందే,  స్టోరీ నచ్చి మూవీ యూనిట్ తో పరిచయం అయింది. కానీ ఇప్పుడు ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో నా డెబ్యూ చేయడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను.

అదే నా క్యారెక్టర్…

ఈ సినిమాలో నాది అందరికీ కనెక్ట్ అయ్యే రోల్. చాలా న్యాచురల్ గా ఉంటుంది. కాలేజ్ స్టూడెంట్, ఫ్రెండ్స్. రియలిస్టిక్ గా ఉంటుంది.

అందుకే ఈ సినిమా…

కిరిక్ పార్టీ చేయకముందు నాకు యాక్టింగ్ కూడా రాదు, కిరిక్ పార్టీ ఎక్స్ పరిమెంటల్ మూవీ కాదు, చాలా రియల్ మూవీ. అందుకే తెలుగు సినిమా లాంచ్ విషయంలో కూడా అలాంటి రియల్ మూవీ అయితే బెటర్ అనుకున్నా. అందుకే ఛలో మూవీ. ఈ సినిమా తరవాత ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ చేస్తా…

 

సక్సెస్ నా నెత్తికి ఎక్కదు…

ఇంకా చాలా అచీవ్ చేయాలి. సడెన్ గా వచ్చిన సెలెబ్రిటీ ట్యాగ్ నన్ను ఏ మాత్రం మార్చలేదు. ఫ్యూచర్ లో కూడా అంతే.

అందుకే ఈ టైటిల్….

నాకు తెలిసి ఈ సినిమాకు ఈ టైటిల్ కి ‘ఛలో’ అనే టైటిలే కరెక్ట్. ఈ టైటిల్ కన్నా బెస్ట్ ఇంకేమీ ఉండదు. అందుకే ఈ టైటిల్ ఫిక్సయ్యారు.

తనే నా ఇన్స్ పిరేషన్…

అనుష్క శెట్టి గారు నాకు చాలాపెద్ద ఇన్స్ పిరేషన్.

డబ్బింగ్ పెద్దగా కష్టమవ్వలేదు….

నాకు డైరెక్టర్ షూటింగ్ టైం లో ఒకరోజు ముందే స్క్రిప్ట్ ఇచ్చేసేవారు. దాంతో ఆ రాత్రి మొత్తం ఆ డైలాగ్స్ ని ప్రాక్టీస్ చేసేదాన్ని. అలా డబ్బింగ్ వరకు వచ్చే సరికి ప్రతీది నా మైండ్ లో స్టోర్ అయి ఉంది కాబట్టి నాకసలేమీ కష్టం అనిపించలేదు.

 

అది నా వల్ల కాదు….

నేను ఖాళీగా కూర్చోలేను. బ్రేక్ తీసుకోవడం అస్సలిష్టం ఉండదు. ఇంకా చాలా సినిమాలు చేయాలి. చాలా మందిని కలవాలి. అందరినీ గమనించాలి. ఇన్స్ పైర్ అవ్వాలి.

అందుకే నో అని చెప్పాను…

‘కిరిక్ పార్టీ’ తెలుగు రీమేక్ లో నటించమని అడిగారు కానీ, తెలుగులో కూడా అంతే ఒరిజినల్  గా నటించగలనా అనిపించింది, అప్పుడు నా మైండ్ సెట్ వేరు, ఇప్పుడు నా మైండ్ సెట్ వేరు… అలాంటి క్యారెక్టర్ ని ఒక్కసారే పర్ఫామ్ చేయగలం అందుకే నో అని చెప్పేశా…

నేను ముందే గెస్ చేశా….

‘చూసీ చూడంగానే..’ సాంగ్ పెద్ద హిట్ అవుతుందని ముందే గెస్ చేశా. షూటింగ్ జరిగేటప్పుడే వెంకీ గారికి ఆ విషయం చెప్పాను…

నా వుడ్ బీ కి చెప్పాను….

‘ఛలో’ సినిమా గురించి నా వుడ్ బీ కి చెప్పాను. కన్నడలో రీమేక్ చేయవచ్చు కదా అని… కానీ తనకు రీమేక్స్ అంటే ఇష్టం ఉండదు. అందుకే నో అని చెప్పాడు (నవ్వుతూ).

హారర్ సినిమాలు చేయను…

నేను హారర్ సినిమాలు చేయను. పెద్దగా ఇష్టం ఉండదు. హిస్టారికల్ మూవీస్, స్పోర్ట్స్ ఓరియంటెడ్, ఫీమేల్ ఒరియంటెడ్ మూవీస్ అయితే చేస్తాను. హారర్ సినిమా చేసినా అందులో దెయ్యం క్యారెక్టర్ ప్లే చేయను. నన్ను నేను దెయ్యంలా ఊహించుకోలేను….

నాకలా నచ్చలేదు…

నాకిప్పుడే పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ పేరెంట్స్ కి కూడా కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా. సో అట్లీస్ట్ ఎంగేజ్ మెంట్ చేసుకో. ఆ తరవాత నీ ఇష్టం అన్నారు.నేనదే చేస్తున్నాను. కానీ కొంతమంది హీరోయిన్స్ వాళ్ళ రిలేషన్ షిప్ గురించి చెప్పుకోవడానికి భయపడతారు. ఫ్యాన్స్ లో రెస్పాన్స్ ఉండదేమో అని. నాకా భయం లేదు.

నెక్స్ట్ ప్రాజెక్ట్….

విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తున్నాను. పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఉంటుంది.