వీకెండ్ రిలీజెస్

Tuesday,January 30,2018 - 02:02 by Z_CLU

ఈ వీకెండ్ 4 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది టచ్ చేసి చూడు మూవీ.

మాస్ రాజా రవితేజ నటించిన సినిమాపై భారీ అంచనాలున్నాయి. రాజా ది గ్రేట్ లాంటి సక్సెస్ తర్వాత వస్తున్న సినిమా కావడం, ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో టచ్ చేసి చూడుపై అంచనాలు పెరిగాయి. రాశిఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

‘టచ్ చేసి చూడు’ సినిమాతో పాటు ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వస్తోంది ఛలో. నాగశౌర్య, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సిమాతో వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నాగశౌర్య తల్లిదండ్రులు నిర్మాతలుగా మారి ఈ సినిమాను తెరకెక్కించారు. సాగర్ మహతి అందించిన పాటలు ఇప్పటికే హిట్ అవ్వడం, ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్.

రాహుల్ రవీంద్రన్ నటించిన హౌరా బ్రిడ్జ్ కూడా విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 3న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు రేవన్ యాదు దర్శకుడు. చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. వడ్డేపల్లి సత్యనారాయణ నిర్మించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ కు శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.

టచ్ చేసి చూడు, ఛలో,  సినిమాలతో పాటు ‘హెచ్ బీ డీ’ అనే చిన్న సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మేఘన, సంతోష్, సల్మాన్, హిమజ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీతో కృష్ణ కార్తీక్ అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.