విశాల్ ‘అభిమన్యుడు’ టీజర్ అదిరింది

Friday,January 05,2018 - 06:51 by Z_CLU

విశాల్, సమంత జంటగా నటించిన అభిమన్యుడు టీజర్ రిలీజయింది. టెక్నోయాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా P.S. మిత్రన్ డైరెక్షన్ లో తెరకెక్కింది. న్యూ ఏజ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ నెగెటివ్ రోల్ ప్లే చేశాడు.

ఈ కాలపు దొంగకి నీ ఇంటి తాళాలు అక్కర్లేదు. నీ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ చాలు’ అంటూ బిగిన్ అయ్యే టీజర్ సినిమా థీమ్ ని ఎలివేట్ చేస్తుంది. ఆన్ లైన్ లో జరిగే ఆర్ధిక లావాదేవీలు, వాటి చుట్టూ జరిగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 26 న రిలీజ్ కానుంది. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేశాడు.