జీ సినిమాలు ( 6th జనవరి )

Friday,January 05,2018 - 10:02 by Z_CLU

 

బ్రహ్మిగాడి కథ

హీరో  హీరోయిన్లు –వరుణ్ సందేశ్, అస్మితా సూద్

ఇతర నటీనటులు –పూనమ్ కౌర్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, కృష్ణుడు, నాగినీడు, అలీ

సంగీతం –కోటి

దర్శకత్వం –ఈశ్వర్ రెడ్డి

విడుదల తేదీ –2011, జులై 1

ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్లుగా నవ్వుకోవాలంటే బ్రహ్మిగాడి కథ చూడాల్సిందే. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో అందర్నీ నవ్వించేలా  తెరకెక్కింది బ్రహ్మిగాడి కథ. రాయలసీమ యాసలో జయప్రకాష్ రెడ్డి చెప్పిన డైలాగులు, తన సీనియార్టీ అంతా ఉపయోగించి బ్రహ్మానందం ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్, చేసిన కామెడీ సినిమాకు స్పెషల్  ఎట్రాక్షన్స్. వీటికి తోడు కృష్ణుడు, అలీ  కూడా నవ్విస్తారు. హీరోయిన్ అస్మితా సూద్ ఈ సినిమాతోనే హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది.

=============================================================================

కృష్ణార్జున

హీరో  హీరోయిన్లు – మంచు విష్ణు, మమతా మోహన్ దాస్, నాగార్జున

ఇతర నటీనటులు – మోహన్ బాబు, నాజర్, నెపోలియన్, సునీల్, బ్రహ్మానందం

సంగీతం – ఎం.ఎం. కీరవాణి

దర్శకత్వం – పి.వాసు

విడుదల తేదీ – 2008, ఫిబ్రవరి 1

లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మించడమే కాకుండా.. ఓ కీలక పాత్ర కూడా పోషించిన చిత్రం కృష్ణార్జున. మంచు మనోజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నాగార్జున కూడా మరో కీలక పాత్ర పోషించడంతో ఇది భారీ సినిమాగా మారిపోయింది. కృష్ణుడిగా నాగార్జున, భక్తుడిగా విష్ణు చేసిన హంగామా ఈ సినిమాకు హైలెట్. సినిమా మధ్యలో మోహన్ బాబు, బాబా గెటప్ లో అలరిస్తారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహించారు. తెలుగులో సోషియో-ఫాంటసీ జానర్ లో వచ్చిన అతికొద్ది చిత్రాల్లో ఇది కూడా ఒకటి.

=============================================================================

బలుపు

నటీనటులు : రవితేజ, శృతి హాసన్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఆషుతోష్ రాణా, అడివి శేష్, సన, బ్రహ్మానందం.

మ్యూజిక్ డైరెక్టర్ : S.తమన్

డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ : వరప్రసాద్ పొట్లూరి

రిలీజ్ డేట్ : 28 జూన్ 2013

రవితేజ కరియర్ లోనే భారీ సూపర్ హిట్ ‘బలుపు’. ICICI బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసే రవితేజ, సిటీలో తండ్రితో పాటు కాలం గడుపుతుంటాడు. నిజానికి వారి గతం ఏంటి..? వారిద్దరూ నిజంగా తండ్రీ కొడుకు లేనా..? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోనూ సూపర్ హిట్ అయింది.

==============================================================================

క్షేత్రం

నటీనటులు : జగపతి బాబు, ప్రియమణి

ఇతర నటీనటులు : శ్యామ్, కోట శ్రీనివాస రావు, ఆదిత్య మీనన్, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, చలపతి రావు, బ్రహ్మాజీ తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : T. వేణు గోపాల్

ప్రొడ్యూసర్ : G. గోవింద రాజు

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2011

జగపతి బాబు, ప్రియమణి నటించిన ఫాంటసీ సినిమా క్షేత్రం. లక్ష్మీ నరసింహ స్వామీ విగ్రహాన్ని తన ఊరి గుడిలో ప్రతిష్టింపజేయాలన్న కల కూడా తీరకుండానే, తన కుటుంబ సభ్యుల చేతిలోనే హత్యకు గురవుతాడు. వీర నరసింహ రాయలు. ఆ విషయం తెలియని అతని భార్య లక్ష్మి తన భర్త ఆఖరి కోరికను తాను నెరవేర్చడానికి సిద్ధ పడుతుంది. అప్పుడు తన అసలు తత్వాన్ని బయటపెట్టే రాయలు కుటుంబ సభ్యులు తన భర్తను కూడా చంపింది తామేనని చెప్పి మరీ లక్ష్మిని చంపేస్తారు. ఆ మోసాని తట్టుకోలేని లక్ష్మి, ఇంకో జన్మెత్తైనా సరే, తన భర్త కోరికను తీరుస్తానని శపథం చేసి మరీ ప్రాణాలు విడుస్తుంది. ఆ తరవాత ఏం జరుగుతుంది అనేదే తరువాతి కథాంశం. వీర నరసింహ రాయలు గా జగపతి బాబు నటన ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

ఒంగోలు గిత్త

నటీనటులు : రామ్ పోతినేని, కృతి కర్బందా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కిషోర్ దాస్, ప్రభు, అజయ్, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రఘుబాబు, సంజయ్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్

రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013

రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, ఆ కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

==============================================================================

యమన్

నటీనటులు : విజయ్ ఆంటోని, మియా జార్జ్

ఇతర నటీనటులు : త్యాగరాజన్, ఆరుళ్ డి. శంకర్, సంగిలి మురుగన్, చార్లీ, G. మరిముత్తు మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ ఆంటోని

డైరెక్టర్ : జీవ శంకర్

ప్రొడ్యూసర్ : A. శుభాస్కరణ్

రిలీజ్ డేట్ : 24 ఫిబ్రవరి 2017

ఓ యాక్సిడెంట్ కేసును తనపై వేసుకొని జైలుకి వెళ్లి దేనికైనా తెగించే వ్యక్తిగా మారిన అశోక్ చక్రవర్తి(విజయ్ ఆంటోనీ) కొందరు రాజకీయ నాయకుల అండదండలతో జైలు నుంచి బయటికొస్తాడు. అలా జైలు నుంచి బయటికి వచ్చిన అశోక్ గతంలో తన తండ్రి దేవరకొండ గాంధీ(విజయ్ ఆంటోనీ)ని చంపిన సాంబ, నరసింహ వంటి రౌడీలతో పాటు ఎం.ఎల్.ఏ పాండుని రాజీకీయంగా ఎలా దెబ్బ కొట్టి అంతం చేశాడుచివరికి తన తండ్రి కలగా మిగిలిన ఎం.ఎల్.ఏ పదవిని ఎలా సొంతం చేసుకొని రాజకీయ నాయకుడిగా ఎదిగాడుఅనేది సినిమా కథాంశం