రిలీజ్ కి రెడీ అయిన నయనతార కర్తవ్యం

Friday,January 05,2018 - 05:21 by Z_CLU

ఓ వైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే మరో వైపు ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తున్న నయనతార బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంటర్ చేస్తూనే ఉంది. ఇప్పటికే థ్రిల్లర్, హారర్ కంటెంట్ తో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసిన నయనతార, రీసెంట్ గా నటించిన పొలిటికల్ ఎంటర్ టైనర్ ‘ఆరమ్’. ఇప్పుడీ సినిమా తెలుగులో ‘కర్తవ్యం’ అనే టైటిల్ తో రిలీజ్ కి రెడీ అవుతుంది.

 

గోపీ నైనర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ పొలిటికల్ ఎంటర్ టైనర్ లో నయనతార కలెక్టర్ గా కనిపించనుంది. రీసెంట్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని క్లీన్ ‘U’ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా, తెలుగులోనూ సూపర్ హిట్ అవ్వడం గ్యారంటీ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. జిబ్రాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని R. రవీంద్రన్, శరత్ మరార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు.