ప్రభాస్ పెళ్ళిపై కృష్ణంరాజు రియాక్షన్

Friday,January 19,2018 - 03:16 by Z_CLU

రెబల్ స్టార్ కృష్ణంరాజు 78 వ బర్త్ డే సందర్భంగా తన ఫిల్మ్ కరియర్ తో పాటు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీడియాతో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ పెళ్ళి గురించి అడిగిన ప్రశ్నకు నవ్వుతూ బదులిచ్చారు.

‘బాహుబలి సినిమాకు ముందు పెళ్ళి గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా పెద్దగా పట్టించుకునే వాడు కాదు, కానీ బాహుబలి తరవాత తన ఆలోచనలో మార్పు వచ్చిందనే అనుకుంటున్నా. ఈ మధ్య పెళ్ళి విషయంలో నా మాటకు విలువిస్తున్నాడు. అంతమాత్రాన ప్రభాస్ పెళ్ళికి ఒప్పుకున్నాడని అర్థం కాదు.’ అని చెప్పుకున్నారు కృష్ణం రాజు.

 

‘సాహో’ సినిమా తరవాత తన బ్యానర్ లో ప్రభాస్ సినిమా ఉంటుందని చెప్పిన కృష్ణం రాజు, ప్రస్తుతం స్టోరీ ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నామని, కుదిరితే ఈ సినిమా లేకపోతే బాలీవుడ్ సినిమా ఉంటుందన్నారు.