ఎట్రాక్ట్ చేస్తున్న భాగమతి ‘మందార మందార’ సాంగ్

Friday,January 19,2018 - 06:02 by Z_CLU

అనుష్క ‘భాగమతి’ జనవరి 26 న రిలీజ్ కి రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచిన సినిమా యూనిట్, ఈ సినిమా ట్రైలర్ తో మ్యాగ్జిమం ఇంప్రెస్ చేసేసింది. దానికి తోడు రీసెంట్ గా రిలీజ్ అయిన ‘మందార మందార’ అంటూ సాగే మెలోడియస్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది.

అల్టిమేట్ హారర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ‘మందార మందార’ సాఫ్ట్ సినిమాలోని సాఫ్ట్ ఆంగిల్ ని ఎలివేట్ చేస్తుంది. అనుష్క, ఉన్ని ముకుందన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సాంగ్, సినిమాపై ఆల్ రెడీ క్రియేట్ అయి ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది.

డిఫెరెంట్ షేడ్స్ లో కనిపించనున్న అనుష్క సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ అయితే, ఏ మాత్రం కాంప్రమైజ్ కాని ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకి హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి. అశోక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. వంశీ, ప్రమోద్ లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.