పూరి సినిమాలో మదర్ సెంటిమెంట్

Saturday,June 27,2020 - 03:52 by Z_CLU

కెరీర్ స్టార్టింగ్ లోనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మంచి ఎమోషన్ మిక్స్ చేసి ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ తీసి సూపర్ హిట్ అందుకున్నాడు పూరి. ప్రస్తుతం మళ్ళీ అదే ఫార్మేట్ లో మరో కథను చూపించడానికి రెడీ అవుతున్నాడు. అవును అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో ఉండే మదర్ సెంటిమెంట్ ను విజయ్ తో చేస్తున్న సినిమాలో మిక్స్ చేస్తున్నాడు.

ఓ వైపు రొమాంటిక్ లవ్ ట్రాక్ , బాక్సింగ్ , మదర్ సెంటిమెంట్ ఇలా అన్ని కలగలిపిన కథతో ఫైటర్(వర్కింగ్ టైటిల్) తెరకెక్కిస్తున్నాడట పూరి. జయసుధతో అప్పట్లో చేయించిన పవర్ ఫుల్ మదర్ క్యారెక్టర్ ను ఈసారి రమ్య కృష్ణతో చేయిస్తున్నాడు.

సినిమాలో రమ్యకృష్ణ , విజయ్ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ ఆకట్టుకుంటాయని, రమ్యకృష్ణ క్యారెక్టర్ సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్స్ అని అంటున్నారు. మరి ఇస్మార్ట్ శంకర్ తో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకొని ఐయాం బ్యాక్ అనిపించుకున్న పూరి ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ కొడతాడో అని అందరు ఎదురుచూస్తున్నారు.