RamPothineni మళ్ళీ గ్యాప్

Tuesday,December 08,2020 - 05:12 by Z_CLU

ప్రస్తుతం స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా రెండు మూడు ప్రాజెక్ట్స్ తో మంచి ప్లానింగ్ తో దూసుకెళ్తున్నారు. అయితే ఆ లిస్టుకి కాస్త దూరంగా ఉంటున్నాడు Ram Pothineni. సినిమా సినిమాకి మధ్య కొన్ని నెలలు గ్యాప్ తీసుకుంటూ ఎవరితో సినిమా చేయాలా? అని సతమవుతున్నాడు.  హలో గురు ప్రేమకోసమే తర్వాత కొన్ని నెలల పాటు తన నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ చెప్పకుండా ఫ్యాన్స్ ని వెయిట్ చేయించాడు రామ్.

ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేస్తున్నాడు. అవును కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటించిన ‘Red‘ సినిమా షూటింగ్ కొన్ని నెలల క్రితమే పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ గా ఉంది. అయినా ఇంత వరకూ నెక్స్ట్ సినిమాను ఎనౌన్స్ చేయలేదు రామ్. ఇటివలే త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలొచ్చాయి. కానీ అందులో నిజంలేదట.

మరి ఇప్పుడు రామ్ చూపు ఏ దర్శకుడి వైపు అనేది ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆసక్తి రేకెత్తిస్తుంది. తోటి హీరోలు గ్యాప్ లేకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తుంటే రామ్ మాత్రం ఏడాదికి ఒక సినిమానే అందిస్తూ స్లో అండ్ స్టడీ మెథడ్ ని ఫాలో అవుతున్నాడు. మరి రామ్ తన స్పీడ్ పెంచి ఇకపై వరుస సినిమాలు చేస్తాడా వేచి చూడాలి.

Also Check సంక్రాంతి కి రామ్ ‘రెడ్’