విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ

Thursday,November 15,2018 - 04:40 by Z_CLU

రిలీజ్ కి ముందే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసుకుంది విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’. హీరోయిజం లాంటి ఎలిమెంట్స్ కాకుండా, కాన్సెప్ట్ బేస్డ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, డెఫ్ఫినేట్ గా ఎంటర్ టైన్ చేస్తుంది అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఈ  క్రేజీ  హీరో.  ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో సినిమా గురించి మరెన్నో విషయాలు చెప్పుకున్నాడు.

అలాంటివి నమ్మను…

మంచి సినిమాలు ఎలాగైనా ఆడతాయి అదొక్కటే నా లాజిక్. జనాల ఎక్స్ పెక్టేషన్స్ లాంటివి నేను మైండ్ లో పెట్టుకోను. టాక్సీవాలా స్టార్ డమ్ తో నడిచే సినిమా కాదు. స్టోరీ బేస్డ్ సినిమా. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.

నాకలా వద్దు…

మిస్టేక్స్ నుండి డెఫ్ఫినేట్ గా నేర్చుకుంటున్నా. ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే మిస్టేక్ ఎక్కడ జరిగిందనే క్లారిటీ అయితే నాకు వచ్చేస్తుంది. నా సినిమాల వరకు ‘పర్వాలేదు చూడొచ్చు’ అనే టాక్ కూడా నాకు ఫ్లాప్ లాగే వినిపిస్తుంది. నాక్కావాల్సింది ‘సినిమా సూపర్బ్ రా.. అందరూ చూడాల్సిందే’ అనిపించుకోవాలి. అప్పుడే అది నాకు హిట్టు.

విపరీతంగా నవ్వుకున్నా…

‘టాక్సీవాలా’ స్టోరీ విన్నప్పుడే విపరీతంగా నవ్వుకున్నా. నా కాలిక్యులేషన్ ప్రకారం ఈ సినిమా ‘అర్జున్ రెడ్డి’ తరవాత రిలీజ్ అవ్వాలి. కానీ ఆ ప్లేస్ లో ‘గీతగోవిందం’ రిలీజవ్వడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యా. ఇప్పుడీ సినిమాకి కిడ్స్ కూడా కనెక్ట్ అవుతారు కాబట్టి పర్పస్ ఫిల్ అవుతుందనే అనుకుంటున్నా.

మాళవిక నాయర్…

సినిమాలో మాళవిక నాయర్  చేసింది ఎక్స్  ట్రీమ్  కీ రోల్. ఆ రోల్ గురించి కొంచెం ఎక్స్ పోజ్ చేసినా స్టోరీలో కీ ఎలిమెంట్ రివీల్ అయిపోతుంది. అందుకే ఆ క్యారెక్టర్ ని టీజర్ లో, ట్రైలర్ లో ఎక్కడా ఉంచలేకపోయాం. బిఫోర్ రిలీజ్ మాళవిక పబ్లిసిటీకి దూరంగా ఉండటమే సినిమాకి బెటర్.

మాళవిక రోల్…

సినిమాలో మాళవిక ప్లే చేసిన రోల్ కోసం చాలా మందిని అనుకున్నాం కానీ, మాళవిక సినిమాకి బెస్ట్ చాయిస్. చాలా బాగా పర్ఫామ్ చేసింది.

నమ్మలేకుండా ఉన్నా… 

మెగాస్టార్ సినిమాలు చూస్తూ పెరిగా.. అలాంటిది నా సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు బన్ని అన్న లాంటి స్టార్స్ రావడం ఏంటో, మెగాస్టార్ నా సినిమాకి అప్లాజ్ ఇవ్వడమేంటో నేనింకా షాక్ లో ఉన్నా. ఇదంతా రేపు నేను ముసలోడినయ్యాక చెప్పుకుని ఎంజాయ్ చేస్తానేమో.

సుజిత్ సారంగ్…

సినిమాటోగ్రాఫర్ సుజిత్ చాలా కష్టపడ్డాడు. సినిమా చేసినన్నీ రోజులు నెక్ బ్యాండ్ పెట్టుకునే ఉన్నాడు. సర్వికల్ స్పాండిలైటిస్ వల్ల డాక్టర్ ఆయనకు కనీసం కెమరాలు కూడా ఎత్తకూడదు అన్నా, పట్టించుకోకుండా కష్టపడ్డాడు. సెట్స్ పై షాట్ బ్రేక్ మధ్యలో ఫిజియో థెరపీ చేయించుకుంటూ కష్టపడ్డాడు. సుజిత్ కి నిజంగా చాలా పెద్ద థాంక్స్.

అదీ జేక్స్ బిజాయ్ పరిస్థితి…

సినిమాకి జేక్స్ బిజాయ్ కూడా ఎంత స్ట్రగుల్ అయ్యాయంటే, చెన్నైలో వాళ్ళ నాన్నకి ఒక వైపు కీమో థెరపీ చేయిస్తూ, మరో వైపు ఈ సినిమా కోసం పని చేశాడు. ఆ డెడికేషన్ కి హ్యాట్సాఫ్.

డియర్ కామ్రేడ్..?

30% కంప్లీట్ అయింది. నెక్స్ట్ షెడ్యూల్ ఈ మంత్ ఎండ్ నుండి బిగిన్ అవుతుంది. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సెకండాఫ్ లో రిలీజవుతుంది.

ఇప్పటి నుండి వేరే లెక్క…

‘డియర్ కామ్రేడ్’ నుండి ఒక సినిమా రిలీజయ్యాకే ఇంకో సినిమా చేయాలని ఫిక్సయ్యా. టైమ్ తీసుకుంటూ చేయాలనే ఫిక్సయ్యా.