రాజశేఖర్ ‘కల్కి’ సినిమా అప్డేట్స్
Thursday,November 15,2018 - 05:16 by Z_CLU
రాజశేఖర్ కొత్త సినిమా ‘కల్కి’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాలో రాజశేఖర్ ఇన్వెస్టిగెటివ్ ఆఫీసర్ లా కనిపించనున్నాడు.
‘గరుడవేగ’ సక్సెస్ తరవాత ఏ మాత్రం హడావిడి లేకుండా పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో సెట్స్ పైకి వచ్చిన రాజశేఖర్, ఈ సినిమాలో రిస్కీ స్టంట్స్ చేస్తున్నాడని తెలుస్తుంది. ‘అ!’ సినిమాతో డిఫెరెంట్ ఫిల్మ్ మేకర్ అనే మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ నుండి కూడా, ఆడియెన్స్ లో ఓ మోస్తరు ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
1980 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ‘కల్కి’ లో నందిత శ్వేత, అదాశర్మ తో పాటు స్కార్లెట్ విల్సన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆశుతోష్ రాణా తో పాటు నాజర్ సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.
శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యపీ మూవీస్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రానికి సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మాతలు.