కుర్ర హీరో కి క్రేజీ ఆఫర్స్...

Saturday,December 31,2016 - 02:30 by Z_CLU

మొదటి సినిమాతో హీరోగా సూపర్ హిట్ కొడితే చాలు ఇక ఆ హీరో వరుసగా ఆఫర్స్ అందుకుంటాడనడం లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అలాంటి వరుస ఆఫర్సే అందుకుంటూ దర్శకులకు నిర్మాతల టార్గెట్ హీరో అయిపోయాడు విజయ్ దేవర కొండ.

  రవి బాబు దర్శకత్వం లో తెరకెక్కిన ‘నువ్విలా’ శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్ ‘ సినిమాల తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయం అయి ‘ఎవడె సుబ్రహ్మణ్యం’ సినిమాతో నటుడిగా గుర్తింపు అందుకున్న విజయ్ దేవర కొండ లేటెస్ట్ గా ‘పెళ్లి చూపులు’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2016 సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలవడం, ఈ సినిమాతో హీరోగా విజయ్ కి మంచి మార్కులు పడటం తో ప్రెజెంట్ అందరి ఫోకస్ ఈ హీరో మీదే పడుతుందట. ఇప్పటికే నందిని రెడ్డి దర్శకత్వం లో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్న ఈ హీరో లేటెస్ట్ గా మరో బంపర్ అఫర్ అందుకున్నాడు. ‘ఓనమాలు’,’మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ‘ఫేమ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో స్టార్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మించనున్న సినిమాలో హీరోగా ఛాన్స్ కొట్టేసాడు విజయ్. ఇవే కాకుండా ఈ కుర్ర హీరో చేతిలో మరో రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ గా ఉన్నట్టు టాక్. ఏదేమైనా ఫస్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హీరో కుండే క్రేజే వేరు….