త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్

Saturday,December 31,2016 - 01:30 by Z_CLU

మొన్నటివరకు రూమర్ గా ఉన్న ఈ కాంబినేషన్ ఇప్పుడు పక్కా అయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వరుసగా సినిమాలు నిర్మిస్తూ వస్తున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్.. ఎన్టీఆర్ తో కొత్త ఏడాదిలో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతోంది. నిర్మాత చినబాబు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 2017 సెప్టెంబర్ లో ఈ సినిమా ఉంటుంది.

ప్రస్తుతం త్రివిక్రమ్, ఎన్టీఆర్ ఇద్దరు వేర్వేరు ప్రాజెక్టులు కమిట్ అయ్యారు. వచ్చేనెల నుంచి పవన్ కల్యాణ్ హీరోగా ఓ సినిమా డైరక్ట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్. అటు ఎన్టీఆర్ కూడా బాబి దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమౌతున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్స్ సెట్స్ పైకి వెళ్తుంది.