మెగా బంపర్ ఆఫర్

Saturday,December 31,2016 - 03:30 by Z_CLU

మెగా హీరోలంతా కలిసి ఇయర్ ఎండింగ్ లో మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ నింపేశారు. మెగా స్టార్ నుంచి మెగా ప్రిన్స్ వరకూ వరుసగా ఫస్ట్ లుక్ పోస్టర్స్, మెగా సాంగ్ తో మెగా ఫాన్స్ కు ఎండింగ్ లో బంపర్ ఆఫర్ అందించారు.

 

mega-offer

   పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూ ఇయర్ విషెస్ చెప్తూ ‘కాటమరాయుడు’ మోషన్ పోస్టర్ తో మెగా ఫాన్స్ లో సందడి షురూ చేయగా ఆ వెంటనే ఖైదీ నంబర్ సినిమాలోని ‘రత్తాలు’ ఐటెం సాంగ్ తో అసలైన సందడి తీసుకొచ్చి హంగామా చేసాడు మెగా స్టార్. ఇక మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ ‘విన్నర్’ సినిమా పోస్టర్ తో ఫాన్స్ ను విష్ చేయగా మరో వైపు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తన ‘మిస్టర్’ ఫస్ట్ లుక్ తో అభిమానులకి న్యూ ఇయర్ విషెస్ తెలిపాడు. ఇలా వరుసగా మెగా హీరోలందరూ తమ సినిమాలకు సంబంధించి సాంగ్ , పోస్టర్స్ తో మెగా ఫాన్స్ లో కొన్ని గంటల ముందే న్యూ ఇయర్ హంగామా తీసుకొచ్చేశారు.