రేపే 'టాక్సీవాలా' ట్రైలర్ రిలీజ్

Wednesday,November 07,2018 - 02:02 by Z_CLU

అగ్రెసివ్ మోడ్ లో జరుగుతున్నాయి విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ ప్రమోషన్స్. రీసెంట్ గా ఈ సినిమా జ్యూక్ బాక్స్ రిలీజ్ చేసిన మేకర్స్, రేపు సినిమాపై మరింత ఇంట్రెస్ట్ రేజ్ అయ్యేలా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ టాక్సీ డ్రైవర్ గా కనిపించనున్నాడన్న విషయం తెలిసిందే.

 

ఇప్పటికే డిఫెరెంట్ టీజర్ తో సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేసిన మేకర్స్, ఈ ట్రైలర్ తో ఫ్యాన్స్ లో సినిమాపై అంచనాలు పెంచనున్నారు మేకర్స్. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో ఇమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.

విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. రాహుల్ సంక్రిత్యాన్ ఈ సినిమాకి డైరెక్టర్. UV క్రియేషన్స్, GA2 పిక్చర్స్ బ్యానర్స్ పై తెరకెక్కిన ఈ సినిమాకి SKN ప్రొడ్యూసర్. నవంబర్ 17 న గ్రాండ్ గా రిలీజవుతుంది టాక్సీవాలా.