రజినీకాంత్ 2.0 నుండి రిలీజైన మూడో సాంగ్

Wednesday,November 07,2018 - 12:46 by Z_CLU

2.0 నుండి మూడో సాంగ్ రిలీజయింది. ‘బుల్లి గువ్వ’ అంటూ లిరిక్స్ తో సాంగ్ ఉన్న ఈ సాంగ్ ని కీరవాణి పాడటంతో  టాలీవుడ్ లో ఈ సాంగ్ మరింత స్పెషల్ అనిపించుకుంటుంది. దీపావళి సందర్భంగా ఈ సాంగ్ ని రిలీజ్ చేశారు ఫిల్మ్ మేకర్స్.

ఈ సాంగ్ లిరిక్స్  ని  బట్టి  ఈ  సాంగ్ ఇమోషనల్ సిచ్యువేషన్ లో ఉండబోతుందని తెలుస్తుంది. సినిమా యూనిట్ ఇప్పటి వరకు జరిగిన ఈవెంట్స్ లో చెప్పినట్టు ఈ సినిమాలో జస్ట్ సెల్ ఫోన్స్ చుట్టూ తిరిగే టెక్నికల్ ఎలిమెంట్స్ తో పాటు మరెన్నో హార్ట్ టచింగ్ సీక్వెన్సెస్ ఉండబోతున్నాయి. ఇక ఈ సాంగ్ ఎగ్జాక్ట్ గా ఏ సందర్భంలో ఉండబోతుందన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది.

వరల్డ్ వైడ్ గా గ్రాండ్ కాన్వాస్ పై రిలీజవుతున్న ఈ సినిమా పై ఇప్పటికే హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్ గా రిలీజైన  ట్రైలర్  సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దానికి తోడు ఫిల్మ్ మేకర్స్ చేస్తున్న అగ్రెసివ్ ప్రమోషన్స్ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేస్తుంది.

శంకర్ డైరెక్షన్ లో లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కుతుంది 2.0. ఎమీ  జాక్సన్  సినిమాలో హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ సినిమాలో బర్డ్ మ్యాన్ గా పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. A.R. రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్. నవంబర్ 29 న ఈ సినిమా రిలీజవుతుంది.