‘టాక్సీవాలా’ రేపే గ్రాండ్ రిలీజ్

Friday,November 16,2018 - 02:30 by Z_CLU

విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ కౌంట్ డౌన్ బిగిన్ అయింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సైంటిఫిక్ థ్రిల్లర్ లా తెరకెక్కిన ఈ సినిమా భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రేపు థియేటర్ లలోకి రానుంది. విజయ్ దేవరకొండని డిఫెరెంట్ డైమెన్షన్స్ లో ప్రెజెంట్ చేయనుంది టాక్సీవాలా.

యూత్ హార్ట్ ఫేవరేట్ విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి మరింత చేరువ కానున్నాడు. మరీ ముఖ్యంగా సినిమాలోని టాక్సీకి, హీరోకి మధ్య ఉండే రిలేషన్ ఏమై ఉంటుందా అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో కనిపిస్తుంది. దానికి తోడు ఏ మాత్రం రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న మాళవిక నాయర్ రోల్ పై ఫ్యాన్స్ లో డిఫెరెంట్ స్పెక్యులేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.

సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సినిమా దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్. జేక్స్ బిజాయ్ బ్యాక్ స్కోర్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ అంటున్నారు సినిమా కోర్ టెక్నీషియన్స్. ప్రియాంక జవాల్కర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.  గీతా ఆర్ట్స్ 2, UV క్రియేషన్స్ బ్యానర్స్ పై S.K.N. ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.