గ్రాండ్ గా రిలీజైన ‘టాక్సీవాలా’

Saturday,November 17,2018 - 10:02 by Z_CLU

గ్రాండ్ గా రిలీజయింది విజయ్ దేవరకొండ టాక్సీవాలా. రిలీజైన ప్రతి సెంటర్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఈ సినిమా. విజయ్ దేవరకొండ కి ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్, దానికి తోడు సినిమాపై క్రియేట్ అయి ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ అన్నీ కలిసి టాలీవుడ్ లో ‘టాక్సీవాలా’ సీజన్ బిగిన్ అయిందా అనిపించేంతలా వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.

ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్ తో, హాలీవుడ్ స్టైల్ ఫిల్మ్ మేకింగ్ తో పర్ఫెక్ట్ ఎంటర్ టైనింగ్ ప్యాకేజ్ లా రెడీ అయిన టాక్సీవాలా ఈ వీకెండ్ కి పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ అనిపించుకుంటుంది. సోషల్ మీడియాలో టాక్సీవాలా కి వస్తున్న రెస్పాన్స్  చూస్తుంటే, విజయ్ దేవరకొండ అకౌంట్ లో మరో బ్లాక్ బస్టర్ చేరిందనే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ ట్రెమెండస్ పర్ఫామెన్స్ కి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.

టాక్సీకి విజయ్ దేవరకొండకి మధ్య ఉన్న రిలేషన్ ని దర్శకుడు రాహుల్ పర్ఫెక్ట్ డీల్ చేశాడు అంటున్నారు ఫ్యాన్స్. ఈ ‘టాక్సీవాలా’ రైడ్ హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ కరియర్ ని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టడం గ్యారంటీ. S.K.N. ఈ సినిమాకి ప్రొడ్యూసర్. జేక్స్ బిజాయ్ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.