ఫస్ట్ లుక్ తో ఎట్రాక్ట్ చేస్తున్న విజయ్

Sunday,June 25,2017 - 10:05 by Z_CLU

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరో సినిమాతో తెలుగులో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవలే అట్లీ డైరెక్షన్ లో ‘పోలీస్’ గా సందడి చేసిన విజయ్ మరో సారి అట్లీ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

తమిళ్ లో మెర్సల్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు తెలుగులో’అదిరింది’ అనే టైటిల్ ను ఖరారు చేశారు మేకర్స్. ‘అదిరింది’ అనే టైటిల్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమా పై అంచనాలు పెంచేస్తున్నాడు విజయ్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్..