మహేష్ తో ఫిక్స్...

Sunday,June 25,2017 - 11:12 by Z_CLU

‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బాలీవుడ్ లో భారీ అఫర్ అందుకున్న పూజ హెగ్డే ప్రెజెంట్ టాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఇటీవలే ‘దువ్వాడ జగన్నాథం’ లో బన్నీ సరసన నటించి తన గ్లామర్ తో కుర్రకారును ఎట్రాక్ట్ చేసిన ఈ భామ లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ సరసన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందట..

మహేష్ హీరోగా వంశీ పైడి పల్లి డైరెక్షన్ లో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న సినిమాకు పూజ హెగ్డే ను ఫైనల్ చేశారనే వార్త వినిపిస్తుంది. లేటెస్ట్ గా డీజే లో గ్లామర్ షో తో అందరినీ ఆకట్టుకున్న ఈ భామ సూపర్ స్టార్ కి సూపర్ జోడి అని అని భావించిన దిల్ రాజు పూజ కి అడ్వాన్స్ కూడా ఇచ్చారని టాక్ చక్కర్లు కొడుతుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయం పై స్పందించిన పూజ నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇంకో పది రోజుల్లో అనౌన్స్ చేస్తా అంటూ చెప్పడం తో ఆ నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా మహేష్ దే అనే టాక్ వినిపిస్తుంది. సో త్వరలోనే ఈ వార్త పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందన్నమాట.