యాక్షన్ మోడ్ లోకి వెంకీ...

Saturday,November 09,2019 - 11:02 by Z_CLU

చాలా రోజుల తరవాత…. వెంకీ యాక్షన్ మోడ్ లో కనిపించబోతున్నాడు. ఈ మధ్య కామెడీ.. ఫ్యామిలీ కథలతో ఎంటర్ టైన్ చేసినా, ఇప్పుడు ‘అసురన్’ రీమేక్ తో అదిరిపోయే యాక్షన్ హీరోగా నటించబోతున్నాడు.

వెంకీకి యాక్షన్ సినిమాలు కొత్తా..? అస్సలు కాదు. కానీ గత కొన్ని సినిమాలుగా యాక్షన్ బేస్డ్ సినిమాలు చెయ్యట్లేదు. ఇప్పుడు సెట్స్ పై ఉన్న వెంకీమామ, గురు, బాబు బంగారం, గోపాల గోపాల ఇలా వరసగా చెప్పుకుంటూ పోతే, ఈ మధ్య చేసిన సినిమాల్లో యాక్షన్ కి పెద్దగా స్కోప్ లేదు. కానీ ఇప్పుడు రీమేక్ కి రెడీ అవుతున్న ‘అసురన్’ కంప్లీట్ గా వేరు.

తమిళ సినిమా వర్షన్ ని బట్టి చూస్తే, ఈ సినిమాలో వెంకటేష్ మాస్ అవతార్ లో కనిపించబోతున్నాడు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని కాజేయాలనుకుంటున్న విలన్ నుండి తమ భూమిని కాపాడుకునే వ్యక్తిలా కనిపించబోతున్నాడు వెంకీ.

‘అసురన్’ తమిళనాట రికార్డులు బ్రేక్ చేసింది. అందుకే ఈ సినిమాని ఎలాగైనా తెలుగు ఆడియెన్స్ కి రీచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు వెంకీ. అసలు కథలో ఉన్న మ్యాజిక్ ఏ మాత్రం చెదరకుండా తెలుగు ఆడియెన్స్ కి నచ్చేలా ఈ సినిమాని తెరకెక్కించే దర్శకుడి వేటలో ప్రస్తుతం ఈ సినిమా నిర్మాతలు. ఒక్కసారి దర్శకుడు ఫిక్సయితే వెంకీ యాక్షన్ మోడ్ లోకి వచ్చేస్తాడు.