రానా కూడా ఈ వరసలో చేరిపోయాడు...

Wednesday,November 13,2019 - 09:01 by Z_CLU

ఆన్ స్క్రీన్ చరిష్మా చూపించే హీరోలు అన్నీ కుదిరినప్పుడు సింగర్స్ గా కూడా మెస్మరైజ్ చేస్తుంటారు. ఇప్పుడు విశాల్ ‘యాక్షన్’ కోసం రానా సింగర్ గా మారాడు. సినిమాలో ఈ పాట ఎలా ఉండబోతుంది..? రానా ఈ పాటని ఎలా పాడాడు అన్నది సాంగ్ రిలీజయితేనే కానీ తెలీదు. అయితే గతంలో కూడా ఇలాగే హీరోలు ఏదో రీజన్ తో తమలోని సింగర్ ని ఫ్యాన్స్ కి పరిచయం చేశారు.

విజయ్ దేవరకొండ : ‘డియర్ కామ్రేడ్’ లో ఓ పాట.. రీసెంట్ గా తన సొంత నిర్మాణంలో తెరకెక్కిన ‘మీకు మాత్రమే  చెప్తా’ ప్రమోషనల్ సాంగ్ ని కూడా పాడాడు. మరీ విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ సింగర్స్ ని మించిపోయాడు అనడానికి లేదు కానీ విజయ్ దేవరకొండ పాటలు కూడా ఫ్యాన్స్ లో వైడ్ స్థాయిలో రీచ్ అయ్యాయి.

అఖిల్ : ‘హలో..’ సినిమాతో తానెంత గ్రేస్ ఫుల్ సింగరో నిరూపించుకున్నాడు అక్కినేని అఖిల్. ‘ఏవేవో కలలు కన్న…’ పాటతో యూత్ కి మరింత దగ్గరయ్యాడు.

 

NTR : ఇప్పటి వరకు ఏకంగా 6 పాటలు పాడాడు. ‘కంత్రి’ సినిమాలో టైటిల్ సాంగ్ తో బిగిన్ అయితే ‘యమదొంగ’ లో ‘ఓలమ్మీ తిక్క రేగిందా..’, అదుర్స్ సినిమాలో ‘చారి..’, రభస లో ‘రాకాసి రాకాసి..’, ‘ఫాలో..ఫాలో..’ సాంగ్ నాన్నకు ప్రేమతో సినిమాలో. వీటితో ఓ కన్నడ సినిమాలో కూడా పాడాడు NTR.

రవితేజ : మాస్ మహారాజ్ కూడా పవర్ సినిమాలో పాడి సింగర్ అనిపించుకున్నాడు. ‘నౌటంకీ.. నౌటంకీ’ అంటూ రవితేజ పాడిన పాట సినిమాలో హైలెట్ గా నిలిచింది.

సిధార్థ్ :  బొమ్మరిల్లు లో ‘అపుడో ఇపుడో..’ సాంగ్ తో బిగిన్ అయితే చుక్కల్లో చంద్రుడు లో ‘ఎవ్రీ బడీ..’, ఆట లో ‘నిను చూస్తుంటే..’, ఓయ్ లో ‘నూట డెబ్బై ఆరు..’, ఓ మై ఫ్రెండ్ లో ‘మా డాడీ పాకెట్స్’, ‘శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్’.. ఈ వరసలో మరిన్ని పాటలు పాడాడు.

వీళ్ళే కాదు సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కూడా సందర్భానుసారంగా పాడేసి సింగర్స్ అనిపించుకున్నారు.