అప్పుడు సమంతా ఇప్పుడు నిధి అగర్వాల్...

Saturday,November 09,2019 - 12:03 by Z_CLU

మామూలుగా ఓ స్టార్ హీరో సరసన అవకాశం దక్కిందంటే హీరోయిన్స్ రేంజ్ మారిపోతుంది. ఆ తరవాత వీలయినంత వరకు అక్కడి నుండి రేంజ్ పెరిగే స్థాయి హీరోల గురించి తప్ప, అప్ కమింగ్ హీరోలని పెద్దగా కన్సిడర్ చేయరు. కానీ ఒకప్పుడు సమంతా.. ఇప్పుడు నిధి అగర్వాల్… ఈ విషయంలో కాస్త డిఫెరెంట్ గా ఆలోచించారు.

బెల్లంకొండ శ్రీనివాస్ డెబ్యూ మూవీ ‘అల్లుడు శీను’ రిలీజ్ నాటికీ ఆల్రెడీ సమంతా స్టార్ హీరోయిన్. వరసగా పెద్ద హీరోల నటిస్తూ బిజీగా ఉన్న టైమ్ లో ఈ సినిమాని కన్సిడర్ చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈ సినిమా మొదటి సినిమానే అయినా, అటు దర్శకుడు వి.వినాయక్, భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ వీటన్నింటినీ కన్సిడర్ చేసి సినిమాకి ఓకె చేసింది. ఇప్పుడు నిధి కూడా అదే ఫార్మూలాని అప్లై చేసింది.

రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ తరవాత నిధి లెవెల్ ఆల్మోస్ట్ మారిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమా సక్సెస్ తో ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చేసింది. అయితే సర్ ప్రైజింగ్ గా ఓ వైపు స్టార్ హీరో సినిమాలను ప్రిఫర్ చేస్తూనే, మరోవైపు డెబ్యూ హీరో గల్లా అశోక్ సినిమాకి సంతకం చేసింది.

గల్లా అశోక్  నటుడిగా ఇంకా ఆడియెన్స్ కి పరిచయం లేదు కానీ, మహేష్ బాబు మేనల్లుడిగా ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి మైలేజ్ ఉంది.దానికి తోడు సినిమాలో తన క్యారెక్టర్ కూడా అంతే ఇంప్రెసివ్ గా ఉండే చాన్సెస్ ఉన్నాయి.. అందుకే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ఇస్మార్ట్ బ్యూటీ.