విక్టరీ వెంకటేష్ – ఏమైనా రెండేళ్ళ తరవాతే!

Friday,June 07,2019 - 11:03 by Z_CLU

టాలీవుడ్ లో ఒక్క టాప్ స్టార్ ఖాళీగా లేడు. కానీ విక్టరీ వెంకటేష్ వీళ్ళందరి కన్నా ఓ మెట్టు పైనే ఉన్నాడు. ఏకంగా ఐదు సినిమాలు ఫిక్స్ చేశాడు. ఈ వరసలో ఇంకో కొత్త డైరెక్టర్ కథ చెప్పాలి అనుకున్నా ఇంకో రెండేళ్ళు ఆగాల్సిందే…

ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ‘వెంకీమామ’ సెట్స్ పై ఉన్నాడు. ఈ లోపే రీసెంట్ గా త్రినాథరావు నక్కినతో సినిమా అనౌన్స్ అయింది. మ్యాగ్జిమం ‘వెంకీమామ’ తరవాత సెట్స్ పైకి  రాబోతున్నది ఈ దర్శకుడితోనే. ఇంతలో తరుణ్ భాస్కర్ తో కూడా సినిమా అనౌన్స్ అయింది.

ఈ 2  సినిమాల గురించి కనీసం గాసిప్ కూడా క్రియేట్ అవ్వకముందే మరో ఇద్దరు టాప్ దర్శకులు వెంకీని ఇంప్రెస్ చేసి ఉన్నారు. వాళ్లే త్రివిక్రమ్, అనిల్ రావిపూడి. వీళ్ళు ఎగ్జాక్ట్ గా ఈ డేట్స్ కావాలి అని ఫిక్స్ అవ్వలేదు కానీ, చిన్న టైమ్ గ్యాప్ దొరికినా ఎనీ టైమ్ సినిమాని సెట్స్ పైకి తీసుకు వచ్చేస్తారు.

ఈ లెక్కన చూస్తే యంగ్ హీరోస్ కన్నా హెవీ డిమాండ్ లో ఉన్నాడు విక్టరీ వెంకటేష్. అఫీషియల్ గా ఇంకా బయటికి రాలేదు కానీ దగ్గుబాటి కాంపౌండ్ లో మరింతమంది ఫిలిమ్ మేకర్స్ వెయిటింగ్ లిస్టులో ఉన్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా వాళ్లకు చాన్స్ దొరికేది మాత్రం మరో రెండేళ్ళ తరవాతే.