విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా అప్డేట్

Friday,October 25,2019 - 11:09 by Z_CLU

వెంకీతో సినిమాని ఫిక్స్ చేసుకున్న దర్శకుల లిస్టు రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. త్రివిక్రమ్, త్రినాథ రావు నక్కిన, తరుణ్ భాస్కర్ వీళ్ళకు తోడు అనిల్ రావిపూడి ‘F2’ సీక్వెల్ చేద్దామని కూడా ఫిక్సయి ఉన్నాడు. వీరిలో మ్యాగ్జిమం తరుణ్ భాస్కర్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ లోపు వెంకీ కొత్త సినిమా అనౌన్స్ చేశారు మేకర్స్.

తమిళ బ్లాక్ బస్టర్ ‘అసురన్’ తెలుగులో రీమేక్ కానుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించబోతున్నాడు. అయితే ఈ రీమేక్ ని  సురేష్ బాబు తో  పాటు, తమిళంలో ‘అసురన్’ ని నిర్మించిన కళైపులి S.థను సంయుక్తంగా నిర్మించనున్నారు.

ఈ సినిమా ఎవరి డైరెక్షన్ లో తెరకెక్కబోతుందన్నది ఇంకొన్ని రోజులు ఆగితే కానీ తెలీదు. ప్రస్తుతం ఈ సినిమాకి  సంబంధించిన కీ టెక్నీషియన్స్ తో పాటు మిగతా నటీనటులను ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారు మేకర్స్.