వెంకీ అట్లూరి ఇంటర్వ్యూ

Monday,February 12,2018 - 02:15 by Z_CLU

వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కింది ‘తొలిప్రేమ’. వరుణ్ తేజ్, రాశిఖన్నా జంటగా నటించిన ఈ సినిమా రిలీజైన ఫస్ట్ డే నుండే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకీ అట్లూరి, ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు…

సంతోషంగా ఉంది…

మొదటి సినిమాతోనే ఈ రేంజ్ లో సక్సెస్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది.

మాట నిలబెట్టుకున్నాను….

భీమవరంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినప్పుడు ఫ్యాన్స్ కి ప్రామిస్ చేశాను. పవన్ నటించిన తొలిప్రేమ గౌరవాన్ని కాపాడతాను అని. ఆ మాటను నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నాను..

 

కొత్తగా అనిపించింది….

సక్సెస్ అవ్వాలనే సినిమా తీశాను కానీ… ఈ రేంజ్ లో సక్సెస్ అవుతుందని అనుకోలేదు. ఫస్ట్ డే నుంచి థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే కొత్తగా అనిపించింది. ఇమోషనల్ సీన్స్ కి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారు.

అలా జరిగింది….

నేనసలు రాశిఖన్నాను ప్రిఫర్ చేయలేదు. ఎవరైనా ఫ్రెష్ ఫేస్ అయితే బావుంటుందనుకుకున్నా.. కానీ ప్రొడ్యూసర్ తో పాటు వరుణ్ కూడా రాశిఖన్నా అయితే బెటర్ అన్నారు. లుక్ టెస్ట్ చేసినప్పుడు పర్ఫెక్ట్  అనిపించింది. పెర్ఫామెన్స్ వరకు వచ్చేసరికి నా మైండ్ లో కొంచెం భయం ఉన్నా, అవన్నీ రాంగ్ అని ప్రూఫ్ చేసింది రాశి.

ఫీలై చేశాడు…

తమన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ చేసినప్పుడు ఒక్కో సాంగ్ ఒక్కరోజులోనే ఫైనల్ అయిపోయేది. అప్పుడు నాకేమీ గొప్పగా అనిపించలేదు కానీ BGM విషయంలో మాత్రం తమన్ నాకు షాకిచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చినప్పుడు నేను ఒక్కసారి కూడా కూర్చోలేదు.  తనే ఫీలై చేశాడు. నేను డైరెక్ట్ గా DTS లో చూసినప్పడు షాక్ అయ్యాను. తను ప్రతి సీన్ ని ఫీల్ అయి చేశాడు. అందుకే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంత అద్భుతంగా వచ్చింది.

 

నిన్నిలా సాంగ్ అప్పటిది…

సినిమాలో ‘నిన్నిలా నిన్నిలా….’ సాంగ్ తమన్ 14 ఏళ్ల క్రితం కంపోజ్ చేసుకున్నాడు. అది ఇప్పుడు ఈ రేంజ్ లో సెన్సేషన్ అయింది.

ఫ్రస్టేట్ అయ్యా కానీ…  

వరుణ్ కి ఈ స్టోరీ లోఫర్, ఫిదా కన్నా ముందే చెప్పా… ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చినందుకు కొంచెం అసహనం చెందాను. కానీ గ్యాప్ లో స్టోరీ ని ఇంకా బెటర్ చేసుకునే ఛాన్స్ దొరికింది. దాంతో ఖాళీగా ఉన్నాను అనే ఫీలింగ్ రాలేదు.

ధైర్యం పెరిగింది…

వరుణ్ ‘ముకుంద’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవ్వడానికింటే ముందే నేను ఈ స్టోరీ రాయడం ప్రారంభించాను. ముకుంద టీజర్ చూసినప్పుడు ఇలాంటి హీరో మన సినిమాకు చేస్తే బావుంటుందని అనుకునేవాడిని. కానీ మెగా హీరో… లవ్ స్టోరీస్ చేస్తాడా..? అనే అనుమానం ఉండేది. కానీ ఎప్పుడైతే ‘కంచె’ రిలీజ్ అయిందో ధైర్యం వచ్చింది. చెబితే వరుణ్ వింటాడని అర్థమైంది. అదే జరిగింది.

 

సినిమా దిల్ రాజు బ్యానర్ లో…

ఈ స్టోరీని నేను దిల్ రాజు గారికే ఫస్ట్ చెప్పాను. ఆయన చేతిలో చాలా సినిమాలు ఉండేసరికి లేట్ అవుతుందని బాపినీడు గారి అబ్బాయికి చెప్పాను. ఆయనకు కథ నచ్చడం, నేను అప్పటికే వరుణ్ ని కన్విన్స్ చేసి ఉండటంతో అన్నీ చకచకా జరిగిపోయాయి.

అది చాలా నేచురల్

సినిమా కోసం వరుణ్, రాశిఖన్నా బరువు తగ్గారు. కానీ మేం జస్ట్ బరువు పైనే ఫోకస్ చేయలేదు. ఫస్ట్ స్టేజ్ లో యంగ్ ఏజ్ లో బేబీ ఫ్యాట్ ఉండి చబ్బీ లుక్ ఉండేలా చూసుకున్నాం. కాలేజ్ డేస్ లోకి వచ్చేసరికి కొంచెం మెచ్యూర్డ్ గా, ఆ తరవాత థర్డ్ స్టేజ్ లో వరుణ్ ని యూరోపియన్ లుక్ లో స్టైలిష్ గా చూపించాం. ఈ వేరియేషన్స్ నేచురల్ గా అందరికీ జరిగేవే.

ఇది అలాంటి ఎక్స్ పీరియన్స్

ఈ సినిమాలో కారు ఎపిసోడ్ అందరికీ బాగా నచ్చింది.  కారులో సీన్ లాంటిది నాకు రియల్ లైఫ్ లో జరగలేదు కానీ, నా ఇంజినీరింగ్ డేస్ లో అలాంటివి చూశాను. మేం వాటిని కారోబార్ అనే వాళ్ళం. అంటే అన్నీ కారులోనే అని అర్థం. నెక్లస్ రోడ్ లో, ఐమాక్స్ దగ్గర అలా చూసిన ఎక్స్ పీరియన్స్ ఉంది.

విజువల్స్ మైండ్ లో ఉండిపోతాయి.

నా రియల్ లైఫ్ లో చూసి స్ఫూర్తి పొందిన ఇన్సిడెంట్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. మనం ఏదైనా బుక్ చదివిన ఎక్స్ పీరియన్స్ కన్నా రియల్ లైఫ్ లో చూసిన విజువల్స్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి.

ప్యూరిటీ కనబడింది

టైటిల్ బయటికి వచ్చాక పవన్ ఫ్యాన్స్ నుండి ఏమైనా నెగెటివ్ రియాక్షన్స్ ఉంటాయేమోనని భయపడ్డాం. అందుకే మేము టైటిల్ రిలీజ్ చేయకుండా వరుణ్ ఫస్ట్ లుక్ తో రిలీజ్ చేశాం… ఒక రైల్వే స్టేషన్ లో వీడియో గేమ్  ఆడుతూ ఉండే స్టిల్ అది.. అందులో ప్యూరిటీ కనబడింది. అందుకే దాన్ని అందరూ ఆక్సెప్ట్ చేశారు… మేము జస్ట్ టైటిల్ రిలీజ్ చేస్తే రియాక్షన్స్ ఇంకోలా ఉండేవి….

నిర్ణయం తీసుకున్నా….

ఒకసారి రాయడం మొదలుపెట్టాక నాకు ఆటోమేటిక్ గా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. రెండింటిలో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను రైటింగ్ తో పాటు డైరక్షనే సెలక్ట్ చేసుకున్నాను.

రైటర్ గా.. డైరెక్టర్ గా…

రైటర్ గాఇట్స్ మై లవ్ స్టోరీ’, ‘కేరింత’, ‘స్నేహగీతం’ చేశాను. ‘జ్ఞాపకం’, ‘స్నేహగీతం’ తర్వాత ఒక షార్ట్ ఫిలింలో నటించాను.

ఇష్టమైన జోనర్స్

లవ్ స్టోరీస్, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ అంటే చాలా ఇష్టం…. నా నెక్స్ట్ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ గారి బ్యానర్ లోనే ఉంటుంది.

అస్సలు అనుకోలేదు.

రాఘవేంద్ర రావు గారు కాల్ చేసి సినిమా బావుందని చెప్పడంతో చాలా హ్యాప్పీగా అనిపించింది. ఆయన టాలీవుడ్ కి ఫస్ట్ షో మ్యాన్. అలాంటిది ఆయన కాల్ చేసి సినిమా బావుందని చెప్పారు. ఆ తర్వాత R. నారాయణ మూర్తి గారు కూడా అదే చెప్పారు. ఇంటికి పిలిచి టిఫిన్ పెట్టి 15 నిమిషాలు మాట్లాడి మెచ్చుకున్నారు.

 

 

KTR గారు….

KTR గారి లాంటి బిజీ పర్సన్ కూడా సినిమా చూసి రియాక్ట్ అవ్వడం గొప్పగా అనిపించింది. మనం మన ఫ్రెండ్స్ సినిమా చూసి కూడా ఒక్కోసారి పెద్దగా రియాక్ట్ అవ్వం. అలాంటిది ఆయన నా సినిమా చూసి ట్వీట్ చేయడం నిజంగా గ్రేట్.

ప్రాసెస్ మారదు.

చేసిన ఒక సినిమా హిట్టయిందని ప్రాసెస్ ఏమీ మారదు. మళ్ళీ స్క్రిప్ట్ రాసుకోవాలి హీరోని మెప్పించాలి. ప్రొడ్యూసర్ ని చూసుకోవాలి. ఏ సినిమాకైనా, ఎన్ని సినిమాలు చేసినా ఈ ప్రాసెస్ కామన్. మహా అయితే సినిమా హిట్టయింది కాబట్టి ఓ 20% కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అంతే.