మంజుల ఇంటర్వ్యూ

Monday,February 12,2018 - 03:58 by Z_CLU

సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా నటించిన ‘మనసుకు నచ్చింది’ ఈ నెల 16 న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంజుల డైరెక్షన్ లో తెరకెక్కింది. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తున్న ఈ సినిమా గురించి చాలా విషయాలు మీడియాతో షేర్ చేసుకున్నారు మంజుల. ఆ ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ మీకోసం…

ఈ సినిమా వేరు…

నేను ఏదో ఒకటి చేయాలని సినిమా చేయలేదు. అసలు నాకు ఆ అవసరం లేదు. కానీ నేను నేచర్ లో ఏదైతే చూశానో, ఏదైతే ఫీల్ అయ్యానో అది షేర్ చేసుకోవాలనిపించింది. అది స్టోరీ టెల్లింగ్ తోనే పాసిబుల్ అనిపించింది. అదే నా సినిమా ‘మనసుకు నచ్చింది’.

బియాండ్ లవ్ స్టోరీ…

‘మనసుకు నచ్చింది’ ఒక లవ్ స్టోరీ. కానీ ఈ సినిమాలో నేచర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. చాలా లేయర్స్ ఉంటాయి ఈ సినిమాలో.  ఈ సినిమాని మన హార్ట్ కి కనెక్ట్ అయ్యేలా చేయడానికి నేను ఈ సినిమాలో నేచర్ ని వాడుకున్నాను…. గాలి, సన్ సెట్, ఫ్లవర్స్, గాలి ఇలా నేచర్ లో ప్రతి అద్భుతాన్ని స్క్రీన్ పై ఎలివేట్ చేశాను… ఈ సినిమాకి హీరో నేచరే…

 

అది నా బాధ్యత….

ఏదో చేయాలి కాబట్టి సినిమా  చేసేయలేదు. స్టోరీ రెడీ అవ్వడానికి నాకు 18 నెలలు పట్టింది. ఏదో చేసేయాలని చేసిన సినిమా కాదు ఇది. చాలా బాధ్యతగా ఫీలై చేశాను.

క్యారెక్టర్స్ ఇన్స్ పైర్ అయ్యాను….

సినిమాలో కథకే కాదు… క్యారెక్టర్స్ కి కూడా లైఫ్ ఉంటుంది. వాటికంటూ స్టోరీలో పర్టికులర్ స్పేస్ ఉంటుంది. అందుకే క్యారెక్టర్స్ ని రిఫరెన్స్ తీసుకున్నాను.,  సినిమాలో ‘నిత్య’ క్యారెక్టర్, నా క్యారెక్టర్ కి చాలా దగ్గరగా ఉంటుంది. నేను కూడా ఎప్పుడూ సన్ రైజ్ ని సన్ సెట్ ని మిస్సవ్వను. ఈ సిన్మాలో హీరోయిన్ కూడా అంతే. ఇంకా నా చుట్టూరా ఉండే మెన్, నాన్నగారి క్యారెక్టర్ నుండి మహేష్ క్యారెక్టర్ నుండి రిఫరెన్స్ తీసుకున్నాను. స్టోరీ మాత్రం చాలా ఫ్రెష్ గా  ఉంటుంది.

నా కథే హీరో….

నేను ఒక హీరోని మైండ్ లో పెట్టుకుని కథను రాసుకోవడాన్ని నమ్మను. స్టోరీ మొత్తం ఫైనల్ అయ్యాకే మేము కాస్టింగ్ బిగిన్ చేశాం.

చాలామందిని కన్సల్ట్ చేశాం…

నేను నాన్నగారి సినిమాలు, మహేష్ సినిమాలు తప్ప పెద్దగా చూడను. దాంతో నాకు యంగ్ హీరోస్ పెద్దగా తెలీదు. అందుకే ఈ సినిమా కోసం సందీప్ కన్నా ముందే చాలా మందిని అనుకున్నాం. కానీ లక్కీగా వర్కవుట్ కాలేదు. సందీప్ ఈ సినిమాకి కరెక్ట్ చాయెస్.

సందీప్ చాలా ట్యాలెంటెడ్

సందీప్ కి మంచి కంటెంట్ ఇస్తే తను సూపర్బ్ గా పర్ఫామ్ చేస్తాడు. అది మీకు ఈ సినిమాలో కనిపిస్తుంది. తన క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. కొంచెం మొండిగా, ఇన్ సెక్యూర్డ్ గా, కోపంగా, లవబుల్ గా, క్రియేటివ్ గా  చివరికి తనకేం కావాలో తెలుసుకుని ట్రాన్స్ ఫామ్ అయ్యే క్యారెక్టర్…

మై ఫస్ట్ లవ్ – డైరెక్షన్

యాక్టింగ్ కన్నా డైరెక్షనే నాకు చాలా ఇష్టం. డైరెక్టర్ గా నాకు ఇది ఫస్ట్ మూవీ అయినా షూటింగ్ టైమ్ లో నాలో 10 సినిమాలు చేసినంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను. నాన్నగారిని చూసి యాక్టింగ్ వైపు ఎట్రాక్ట్ అయ్యాను కానీ డైరెక్షనే నా ఫస్ట్ లవ్…

అలా అనుకునేదాన్ని కానీ….

స్టోరీ రైటింగ్ అంటే లాంగ్వేజ్ పై చాలా కమాండ్ ఉండాలేమో అనుకునే దాన్ని. కానీ ఎప్పుడైతే నేను స్టోరీ రాయడం మొదలుపెట్టానో అప్పుడర్థమయింది. స్టోరీ టెల్లింగ్ అంటే ఇమోషన్స్… లాంగ్వేజ్ కాదు. లాంగ్వేజ్ పై కమాండ్ ఉంటే బెటరే కానీ, ఇమోషనల్ వ్యాల్యూస్ కంపల్సరీగా ఉండాలి. అవి నాకున్నాయి అనిపించింది.

ఇంట్లో చెప్పినప్పుడు…

నేను సినిమా డైరెక్షన్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు నాన్నగారు చాలా థ్రిల్ ఫీలయ్యారు. నేను ‘తెలుగు వీర లేవరా’ సినిమాకి పని చేశాను కానీ, నేనింత సీరియస్ గా ఉన్నానన్న విషయం ఆయనకు తెలీదు.. అందునా కిరణ్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పగానే చాలా హ్యాప్పీ… బయటి ప్రొడ్యూసర్ ని కూడా కన్విన్స్ చేసుకున్నందుకు థ్రిల్ గా ఫీలయ్యారు…

మహేష్ రియాక్షన్…

డైరెక్షన్ అంటే ఎంత టఫ్ జాబ్.. అసలేమనుకుంటున్నావ్ అన్నాడు మహేష్. కానీ ఎప్పుడైతే మూవీ ట్రైలర్ చూశాడో షాక్ అయ్యాడు….

నాకు నేనే ఇన్స్ పిరేషన్….

నన్నెవరూ ఇన్స్ పైర్ చేయలేదు. స్టోరీ టెల్లింగ్… విజువల్ మీడియా ద్వారా స్టోరీ చెప్పాలి అనే కోరికే నా ఇన్స్ పిరేషన్. మణిరత్నం కొన్ని సినిమాలు నాకు చాలా ఇష్టం. అలాగే జోయా అఖ్తర్, ఇంతియాజ్ ఆలీ, ఫర్హాన్ అఖ్తర్ స్టైల్ కి నా ఆలోచనలు దగ్గరగా ఉంటాయి..

మహేష్ బాబు పిలిచి సినిమా చేస్తాడు…

మహేష్ బాబు తో సినిమా చేసినా, తనని మైండ్ లో పెట్టుకుని స్టోరీ రాయను. మహేష్ బాబుకు సూట్ అవ్వని  స్టోరీ ఉండదు కానీ, తన ఇమేజ్ కి తగ్గట్టు ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. ఈ సినిమా చూసిన తరవాత నేను రాయకముందే తనే నా దగ్గరికి వచ్చి సినిమా చేస్తానంటాడు…

నేను యాక్ట్ చేయలేదు…

నేను ఈ సినిమాలో గెస్ట్ రోల్ లాంటివేమీ చేయలేదు. మా అమ్మాయితో పాటు మా హజ్బెండ్ ఈ సినిమాలో నటించారు, మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు…

అది నా డ్రీమ్…

మహేష్ బాబుతో సినిమా చేయాలనేది నా డ్రీమ్. మహేష్ బాబు లాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న స్టార్ మన టాలీవుడ్ కి దొరకడం అదృష్టం. ఒకరోజు నేను తప్పకుండా మహేష్ బాబుతో సినిమా చేస్తాను అనే నమ్మకం నాకుంది. తనే నన్ను పిలిచి సినిమా చేద్దాం అంటాడు…

సోషల్ మీడియా అద్భుతమైన ప్లాట్ ఫామ్…

నేను ఇంతకు ముందు సోషల్ మీడియాలో కూడా లేను. ఈ సినిమా కోసం రీసెంట్ గా ఫేస్ బుక్ కి వచ్చాను. నాకు సెల్ఫీ తీసుకోవడం కూడా రాదు. రీసెంట్ గా నాకు మా పాప నేర్పింది. కానీ సోషల్ మీడియా వండర్ ఫుల్ ప్లాట్ ఫామ్. దీన్ని సరిగ్గా వాడుకుంటే ఏదైనా అచీవ్ చేయొచ్చు.

టైమ్ పడుతుంది…

సినిమా డైరెక్షన్ కి టైమ్ పడుతుంది. స్టోరీ టెల్లింగ్ కి మెచ్యూరిటీ ఉండాలి. నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తరవాత రాయడం బిగిన్ చేశాను. ఆ తరవాత ఇంగ్లీష్ నుండి తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేయడానికి రైటర్ దొరికే వరకు టైం పట్టింది. అలా జరిగింది.

అడ్వైజ్ ఏమీ ఇవ్వలేదు…

నాన్నగారు తనకేదో బాగా తెలుసు.. చెప్పేద్దాం అని అస్సలు అనుకోరు. నేనీ సినిమా గురించి చెప్పినప్పుడు కూడా సలహాలు ఇవ్వడం లాంటివేమీ చేయలేదు.

ట్రైలర్ చూశాక….

సినిమా ట్రైలర్ చూశాక నాన్నగారు.. చాలా పెద్ద సినిమా అనిపిస్తుంది. ట్రైలర్ చాలా బావుంది అన్నారు. ఆ తరవాత ఆయనకు చాలా కాల్స్ రావడంతో ఆయన మొహం వెలిగిపోయింది.   

అదే ఈ సినిమా…

లైఫ్ అంటేనే సెలెబ్రేషన్… మనసుకు నచ్చి ఎంజాయ్ చేసే పని చేయాలి. మన మనసుతో మనం కనెక్ట్ అయి ఏ పని చేసినా ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఫార్ములా లేని సెన్సిబుల్ కమర్షియల్ మూవీ….

ఫిల్మ్ మేకర్స్ మారాలి….

ఫిల్మ్ మేకర్స్ ఆలోచనా విధానం మారాలి. కథలు కొత్తగా రాయాలి. ఇలా రాస్తే జనాలు చూడరు. ఇలా ఉంటేనే జనాలు చూస్తారు, అని తీసిందే తీయడం కాదు. ఫిల్మ్ మేకర్స్ ఆ చేంజ్ తీసుకు రావాలి. సినిమా అనేది చాలా పెద్ద బాధ్యత.

 

మ్యూజిక్ కీ రోల్….

నాకు A.R. రెహమాన్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాకు కూడా నేను అయన చేస్తే బావుంటుందని అనుకున్నా.. కానీ ఇది నా ఫస్ట్ ఫిల్మ్. ఒకవేళ ఆయన చేసినా ఆయన టైమ్ ఫ్రేమ్స్, నా టైమ్ ఫ్రేమ్స్ మ్యాచ్ అవ్వకపోవచ్చు అందుకే రథన్ అనుకున్నాను. తను ‘అందాల రాక్షసి’ సినిమాకి చేసిన సాంగ్స్ వింటే A.R. రెహమాన్ గుర్తొచ్చారు… అందుకే రథన్ ని ఫిక్సయ్యా.. మైండ్ బ్లోయింగ్ ట్యూన్స్ ఇచ్చాడు…

నెక్స్ట్ సినిమా…

నా నెక్స్ట్ మూవీ ఇంకా ఏమీ అనుకోలేదు. ముందు స్టోరీ రాసుకుని ఆ తరవాత హీరోను ఫిక్స్ చేసుకుంటా…