వెంకటేష్ తేజ సినిమా కాస్టింగ్ కాల్

Tuesday,January 23,2018 - 12:28 by Z_CLU

డైరెక్టర్ తేజ వెంకటేష్ సినిమాల ప్రీ ప్రొడక్షన్ ఫాస్ట్ పేజ్ లో జరుగుతుంది. రీసెంట్ గా ఈ సినిమాలో నారా రోహిత్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని అఫీషియల్ గా అనౌన్స్  చేసిన తేజ, సినిమాలో తక్కిన నటీనటులను ఎంపిక చేసుకునే ప్రాసెస్ లో ఉన్నాడు. ఈ నెల 25 నుండి జరగనున్న ఆడిషన్స్ కి సంబంధించి డీటేల్స్ అనౌన్స్ చేశాడు తేజ.

తన పాత స్టైల్ లోనే కొత్తవాళ్ళతో సినిమాను ప్లాన్ చేస్తున్న తేజ సోషల్ మీడియాలో కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశాడు. ఈ నెల 25 నుండి 27 వరకు జరగనున్న ఈ ఆడిషన్, రామానాయుడు స్టూడియోలో మార్నింగ్ 10 AM నుండి 1 PM వరకు జరగనుంది. ఇంట్రెస్ట్ ఉన్న అస్పైరింగ్ యాక్టర్స్ లోంచి బెస్ట్ ను పిక్ చేసుకుని సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చే ప్రాసెస్ లో ఉన్నాడు తేజ.

‘నేనే రాజు నేనే మంత్రి’ తరవాత మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన తేజ, ఈ సారి కూడా సెన్సేషనల్ హిట్ కొట్టడం గ్యారంటీ అంటున్నాయి ఇన్ సైడ్ సోర్సెస్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న నటీనటులు ఆడిషన్స్ లో పాల్గొని విక్టరీ వెంకటేష్ సినిమాలో చాన్స్ కొట్టేయండి.