నాని నాగార్జున సినిమా లాంచ్ డేట్ ఫిక్సయింది

Tuesday,January 23,2018 - 11:20 by Z_CLU

శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో నాని, నాగార్జున ల మల్టీస్టారర్ అనగానే టాలీవుడ్ సరౌండింగ్స్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయింది. ఇన్ని రోజులు స్క్రిప్ట్ మాడిఫికేషన్ ప్రాసెస్ లో ఉన్న ఈ సినిమా ఫైనల్ గా సెట్స్ పైకి రానుంది. అల్టిమేట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో సెట్స్ పైకి రానుంది.

అశ్విని దత్ నిర్మించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉంది. సినిమాలో హీరోయిన్స్ తో పాటు, తక్కిన టెక్నీషియన్స్ ని ఫైనల్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్, త్వరలో సినిమాకి సంబంధించి తక్కిన డీటేల్స్ ని అనౌన్స్ చేయనుంది.