ఆగస్ట్ నుంచి ఎన్టీఆర్ బయోపిక్

Tuesday,January 23,2018 - 01:32 by Z_CLU

ఎన్టీఆర్ బయోపిక్ రెగ్యులర్ షూటింగ్ కు డేట్ ఫిక్స్ అయింది. ఆగస్ట్ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నట్టు స్వయంగా బాలయ్య ప్రకటించారు. జై సింహా సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరిన సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడిన బాలయ్య ఈ విషయాన్ని ప్రకటించారు. సినిమాకు సంబంధించి ఆఫీస్ కూడా తెరిచిన విషయాన్ని బయటపెట్టారు.

ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేశారు. నటసార్వభౌముడి వర్థంతి సందర్భంగా సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. నిజానికి ఈ మూవీకి సంబంధించి టీజర్ కూడా రెడీగా ఉంది. కానీ వర్థంతి రోజున కాకుండా, మరో ముఖ్యమైన రోజున టీజర్ ను విడుదల చేయబోతున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య 62 గెటప్స్ లో కనిపించబోతున్నాడు. కల్యాణ్ రామ్ కొడుకు కూడా ఇందులో నటించబోతున్నాడు. ఎన్టీఆర్ జీవితాన్ని పరిపూర్ణంగా ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారు.