వెంకటేష్ ఇంటర్వ్యూ

Wednesday,January 09,2019 - 08:28 by Z_CLU

F2 సినిమా సక్సెస్ గ్యారంటీ అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు విక్టరీ వెంకటేష్. ఒక్కోసారి సినిమాలో తన కామెడీ టైమింగ్ కి తనే సర్ ప్రైజ్ అయ్యానని, సినిమాలోని ప్రతి సీన్ న్యాచురల్ గా నవ్విస్తుందని చెప్పుకున్న వెంకీ, ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు మీడియాతో చెప్పుకున్నాడు.

మళ్ళీ ఆ స్థాయి…

నా ప్రీవియస్ సినిమాల గురించి ఆలోచించుకున్నప్పుడు, ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ కంటెంట్ కానీ మళ్ళీ ఆ స్థాయి సినిమా చేయాలి అనుకుంటున్నప్పుడు అనిల్ రావిపూడి ఈ సబ్జెక్ట్ చెప్పాడు. ఇమ్మీడియట్ గా చేసేద్దామని చెప్పా.

నేనే సర్ ప్రైజ్ అయ్యా…

ఇంకా నాలో కామెడీ టైమింగ్ ఉందా..? అని ఎక్కడో నాకే అనుమానం ఉండేది. కానీ ఎప్పుడైతే ఒక్కో సీన్ చేస్తూ వెళ్ళానో, సర్ ప్రైజ్ అయిపోయా…

అసలు ప్లాన్డ్ కాదు..

‘ఒక మగాడి చరిత్ర గురించి చెప్పాలంటే…’ డైలాగ్ లో అసలు ఆ ఎక్స్ ప్రెషన్ ప్లాన్ చేసిందే కాదు, స్పాంటినియస్  గా జరిగిపోయింది. దానికి ఆడియెన్స్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇమేజ్ అంటే అర్థం…

ఇమేజ్ అంటే ఎగ్జాక్ట్ అర్థం నిజంగా నాకు తెలీదు. ఒకవేళ నిజంగా నాకు ఒక ఇమేజ్ కావాలి అనే ఫీలింగ్ ఉంటే  దాని గురించి స్టడీ చేసి, దాని ప్రకారమే సినిమాలు ప్లాన్ చేసుకునేవాణ్ణేమో. యాక్టింగ్ అనేది నా ప్రొఫెషన్. నాకిది  బిజినెస్ లాంటిది. నా పర్ఫామెన్స్ ని ఎవరైనా అప్రీషియేట్ చేస్తే హ్యాప్పీగా ఫీలవుతా… అంతే.

అదీ అనిల్ రావిపూడి…

కథలో కొత్తదనం లేకపోయినా, ఒక్కోసారి క్యారెక్టరైజేషన్స్ వల్ల ఫ్రెష్ నెస్ వచ్చేస్తుంది. ఆ ఫ్రెష్ నెస్ కి డైరెక్టర్ పర్టికులర్ స్టైల్ కూడా ఆడ్ అయితే, ప్రతీది కుదురుతుంది. అనిల్ లో స్పార్క్ ఉంటుంది. తన స్టైల్ పంచెస్, స్టోరీ టెల్లింగ్… F2 ఫన్ ప్యాక్డ్ ఫిల్మ్.

వరుణ్ తేజ్ తో పని చేయడం…

యంగ్ స్టర్స్ తో పని చేయడం వల్ల ఏదో ఒకటి నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. వరుణ్ బెస్ట్ సపోర్టివ్ కో స్టార్. ఏ సీన్ చేసినా ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకుని డిఫెరెంట్ గా చేయడానికి ప్రయత్నించేవాళ్ళం.

ఇదే ఫస్ట్ టైమ్…

వరుణ్ కి ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఫస్ట్ టైమ్. బిగినింగ్ లో కొంచెం నర్వస్ గా ఫీలైనా, ఇమ్మీడియట్ గా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయాడు. దానికి తగ్గట్టే తన బాడీ లాంగ్వేజ్ ని కూడా మార్చుకున్నాడు.

ఏది ఏమైనా అదే నిజం…  

ఏది ఏమైనా మనం విమెన్ కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. వాళ్ళ స్థానం ఎప్పటికైనా గొప్పదే. వాళ్ళ వల్లే మనం ఉన్నాం. దాన్ని గుర్తించాల్సిందే.

F2 గురించి…

ఈ సంక్రాంతికి కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. థియేటర్స్ కి వచ్చి కడుపు నిండా నవ్వుకోండి.