Interview వెంకటేష్ ( ఎఫ్ 3)

Tuesday,May 24,2022 - 07:48 by Z_CLU

వరుస సినిమాలతో బిజీ స్టార్ గా కొనసాగుతున్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన అప్ కమింగ్ సినిమా ‘F3’ రిలీజ్ సందర్భంగా కొన్ని విశేషాలు మీడియాతో పంచుకున్నాడు. త్వరలో రానా కాంబినేషన్ లో రాబోతున్న వెబ్ సిరీస్ గురించి డీటెయిల్స్ కూడా చెప్పుకున్నాడు. ఆ విశేషాలు వెంకీ మాటల్లోనే…

 

ఇమేజ్ ని క్యారీ చేయకూడదు

నా ప్రతీ సినిమాని మొదటి సినిమాగానే భావిస్తా. ప్రతీ సినిమాకి అలానే కష్టపడతా. నా స్టార్ డమ్ ఇమేజ్ ని ఎప్పుడూ క్యారీ చేయను. ముఖ్యంగా కామెడీ ఎంటర్ టైనర్లు చేసినప్పుడు ఇలాంటి ఇమేజ్ ని క్యారీ చేయకూడదు. అప్పుడే నేచురల్ ఫ్లో బయటికివస్తుంది. ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, అబ్బాయిగారు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి.. ఇలా ఎన్నో చిత్రాలు ఎలాంటి ఇమేజ్ లెక్కలు వేయకుండా చేసినవే. సినిమా చేసినప్పుడు ఎక్కువ అలోచించను. సినిమాని నా పాత్రని ఎంజాయ్ చేస్తాను. బహుశా అనిల్ రావిపూడికి కూడా ఇదే అనిపించుటుంది. ఎఫ్ 3 అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది.

 

స్పెషల్ ఎనర్జీ వచ్చేస్తుంది

నారప్ప, దృశ్యం రెండూ సీరియస్ సినిమాలు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఎఫ్ 3తో మళ్ళీ థియేటర్ ఆడియన్స్ ని కలవడం ఆనందంగా వుంది. కామెడీ అనగానే ఒక ప్రత్యేకమైన ఎనర్జీ వచ్చేస్తుంది. కాలేజీ రోజుల్లో ఉన్నట్లే అనిపిస్తుంది. నేను సహజంగానే అందరితోనూ సరదాగా ఉంటా. నన్న ఇలా చూడటానికి ప్రేక్షకులు కూడా ఇష్టపడతారు. రెండేళ్ళ గ్యాప్ తర్వాత ఎఫ్ 3లాంటి బిగ్ ఎంటర్ టైనర్ తో రావడం ఆనందంగా వుంది. ఫ్యామిలీ తో కలసి ఇలాంటి ఎంటర్ టైనర్లు చూడటంలో ఓ కిక్ వుంటుంది.  ఎఫ్ 2పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాని, పాత్రలని  ప్రేక్షకులంతా అభిమానించారు. ఎఫ్ 3 నుండి ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ వినోదం కోరుకుంటారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఎఫ్ 2కి ట్రిపుల్ డోస్ వినోదం ఎఫ్ 3లో వుంటుంది.

 

స్పాంటేనియస్ గానే వుంటుంది

ఇచ్చిన స్క్రిప్ట్ కి డబుల్ డోస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అయితే ఏదీ ప్లాన్ చేసుకోను. స్పాంటేనియస్ గా వస్తుంటాయి. కొన్నిసార్లు నేను చేసింది మర్చిపోతాను. దర్శకుడు అనిల్ మళ్ళీ గుర్తు చేసి అది బావుంది మళ్ళీ చేయండని అడుగుతారు.    ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి..ఇలా ఏ సినిమా తీసుకున్నా.. పెద్ద ప్లాన్ చేయడం అంటూ ఏమీ వుండదు. స్పాంటేనియస్ గానే వుంటుంది.

 

బాగా అబ్జర్వ్ చేస్తాను

నాకు చిన్నప్పటి నుండి అబ్జర్వేషన్ వుంది. ప్రతిది బాగా అబ్జర్వ్ చేస్తాను.  ప్రయాణాలు చేసినప్పుడు, నలుగురితో కలిసినప్పుడు.. వారి ఎక్స్ ప్రెషన్స్, బాడీ లాంజ్వేజ్ ని గమనిస్తుంటాను. ఇక బోలెడు మంది గొప్ప కమెడియన్లు వున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటాం.

 

డబుల్ డోస్

ఎఫ్ 2 సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ అంతా బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కడైనా కనిపించినప్పుడు వెంకీ హాసన్ అంటూ నా ముందు యాక్ట్ చేస్తుంటే సంతోషంగా ఉంది. వాళ్ళు ‘బొబ్బిలి రాజా’, ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలు చూసి ఉండరు. గత సినిమాలు తెలియదు కానీ F2 లో న కేరెక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యారు . ఒకరకంగా చిన్న పిల్లలకు కూడా ‘ఎఫ్ 2’ నన్ను బాగా దగ్గర చేసింది. ఇప్పుడు ఎఫ్ 3 దానికి మించి ఎంటర్టైన్ చేస్తుంది. ఈసారి ఎంటర్టైన్ మెంట్ డబుల్ డోస్ లో ఉండబోతుంది.  మోర్ ఫన్ యాడ్ అయ్యింది. చాలా మంది నటులు యాడ్ అయ్యారు. సినిమా చాలా లావిష్ గా తీశాం. చాలా మంచి సీక్వెన్స్ లు వున్నాయి. ఎఫ్ 2కి మించిన ఫన్ ఎఫ్ 3 లో వుంది.

 

వాళ్ళ కోపరేషణ్ వల్లే

ఎఫ్ 3 చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. అందరూ వారి బెస్ట్ ఇచ్చి యాక్ట్ చేశారు. ఎవరికీ వారు డామినేట్ చేసేలా యాక్ట్ చేశారు. అది సినిమాకు బాగా కలిసొచ్చింది. ఒకరకంగా వల్ల కోపరేషణ్ వల్లే అవుట్ పుట్ బాగా వచ్చింది.

 

కోవిడ్ వల్ల ఇబ్బందులు

షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా భయం భయంగా వర్క్ చేశాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూట్ చేసుకొచ్చాం. నిజానికి మిగతా వారందరూ దూరంగా మాస్క్ పెట్టుకొని వర్క్ చేశారు. కానీ యాక్టర్స్ కి మాస్క్ పెట్టుకొని వర్క్ చేయడానికి వీలు పడదు. దూరంగా చిన్న డైలాగులు ఉంటే పరవాలేదు. కానీ దగ్గర ఉంది పెద్ద పెద్ద డైలాగులు అరుస్తూ చెప్పే టప్పుడు వారి నోటి నుండి ఏదైనా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. షూటింగ్ అవ్వగానే చాలా కేర్ తీసుకున్నాను. షాట్ అవ్వగానే ఆవిరి పడుతూ తగు జాగ్రత్తలు తీసుకున్నాను. నిజానికి అందరూ జాగ్రత్త వహించాలి.

 

వరుణ్ తో కుదిరింది

వరుణ్ నేను కలిసి ఆల్రెడీ ‘ఎఫ్ 2’ చేశాం. అందులో మా ఇద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఎఫ్ 2 లో మా కాంబినేషన్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేశారు.  ఎఫ్ 3లో వరుణ్ తేజ్ పాత్ర ఇంకా బావుంటుంది. చాలా అద్భుతంగా చేశాడు. వరుణ్ తో వండర్ ఫుల్ జర్నీ.

 

మనకు కావాల్సింది ఇస్తుంది

డబ్బు అందరికీ కావాలి. దానికి కోసం అందరూ సరైన మార్గంలో కష్టపడాలి. ఈ నేచర్ మనకు కావాల్సింది ఇస్తుంది. లేనిదాని కోసం ఎక్కువ తాపత్రయపడకూడదు. వున్నదాన్ని సక్రమంగా వాడుకోవాలి. ఆనందంగా బ్రతకాలి.

 

క్లారీటీ ప్లస్ కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్ 

అనిల్ రావిపూడి చాలా సింపుల్ పర్శన్. నటీనటుల నుండి ది బెస్ట్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు.  చాలా అద్భుతంగా రాస్తారు. ఆయన డైలాగ్స్ చాలా నేచురల్ గా వుంటాయి. దీంతో నటన కూడా సహజంగా అనిపిస్తుంది. అనిల్ చాలా ఎనర్జిటిక్. మేము ఇద్దరం క్రేజీగా వుంటాం. మసాలా సినిమా నుండే అనిల్ నాకు తెలుసు. అనిల్ లో అద్భుతమైన కామెడీ టైమింగ్ వుంది. ఆయనకి ఏం కావాలో క్లారిటీ వుంది.

 

చాలా హార్డ్ వర్క్ చేస్తారు

దిల్ రాజు గారు నాకు చాలా కాలం క్రితమే తెలుసు. ‘ప్రేమించుకుందాం రా’ సమయంలోనే ఆయన సినిమాలో స్పార్క్ గమనించారు. ఆయన సినిమాని చాలా బాగా పరిశీలిస్తారు. సినిమాల పట్ల చాలా ప్యాషన్ వుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఎంతో కృషి చేస్తే గానీ ఇన్ని విజయాలు రావు. ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటాను.

 

థియేటర్స్… నైస్ ఫీలింగ్స్

ఎన్ని ఫ్లాట్ ఫార్మ్స్ వచ్చినా కొన్ని సినిమాలు థియేటర్స్ లో నైస్ ఫీలింగ్ అందిస్తాయి. ‘ఎఫ్ 3’ లాంటి  సినిమాలను ఫ్రెండ్స్ , ఫ్యామిలీ సమేతంగా థియేటర్స్ లో చూస్తే బాగుంటుంది. నవ్వులు . ‘F3’ థియేటర్స్ లో నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ అందిస్తుంది అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక నా ఫ్యాన్స్ కూడా కొన్నేళ్లుగా నా సినిమాలు థియేటర్స్ లో మిస్ అవుతున్నారు. వారందరికీ ఈ సినిమా థియేటర్స్ లో మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

 

వెబ్ సిరీస్ … త్వరలోనే ఫస్ట్ లుక్

 రానా ఓ వెబ్ సిరీస్ సజిస్ట్ చేశాడు. స్క్రిప్ట్ నచ్చడంతో ఒకే చేసి షూట్ కంప్లీట్ చేశాను. అందులో నా లుక్, కేరెక్టర్ చాలా కొత్తగా ఉండబోతుంది. ఆ లుక్ త్వరలోనే రివీల్ అవ్వనుంది. సౌత్ ఇండియాలోనే కొత్త ప్రయత్నంగా ఉంటుంది. ప్రస్తుతం దానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ ఏడాది లోనే నెట్ ఫ్లిక్స్ లో సిరీస్ రిలీజ్ అవ్వనుంది. ఇక సల్మాన్ ఖాన్ తో ఓ హిందీ సినిమా చేయబోతున్నాను వచ్చే నెలలో ఆ సినిమా సెట్స్ లో జాయిన్ అవుతాను.

అలాగే నెక్స్ట్ ,సితార ఎంటర్టైన్ మెంట్ , మైత్రి మూవీ మేకర్స్ బేనర్స్ లో సినిమాలు చేయబోతున్నాను. ఆ సినిమాలకు ఇంకా డైరెక్టర్స్ ఫిక్స్ అవ్వలేదు. వాళ్ళు కథలు చూస్తున్నారు అన్ని కుదిరినప్పుడు ఆ సినిమాలు చేస్తాను.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics