Interview - వెంకటేష్ (నారప్ప మూవీ)

Saturday,July 17,2021 - 04:57 by Z_CLU

మరో మూడు రోజుల్లో ‘నారప్ప’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విక్టరీ వెంకటేష్. తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘అసురన్’ కి రిమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు వెంకటేష్. ఆ విశేషాలు వెంకీ మాటల్లోనే.

ఎందుకు అని అడగను

‘నారప్ప’ కోసం నటుడిగా నా ఎఫర్ట్ నేను పెట్టి వర్క్ చేశాను. సినిమా బాగా వచ్చింది. OTT రిలీజ్ అని చెప్పారు ఓకె అన్నాను. ఎందుకు అనే ప్రశ్న జీవితంలో ఉండకూడదు అని ఫీలవుతుంటాను. అందుకే ఎందుకు అని ఎవ్వరినీ అడగను. ఇప్పుడు OTT రిలీజ్ అనే కాదు. ఒకప్పుడు సెంటర్స్ గురించి కూడా ఫ్యాన్స్ అడిగే వారు. కానీ నేను ఆ సైడ్ ఎక్కువ పట్టించుకోను. నటుడిగా వచ్చిన క్యారెక్టర్ బెస్ట్ ఇచ్చానా లేదా అని మాత్రమే ఆలోచిస్తాను. ఏదైనా ఒక పని చేసినప్పుడు సమయమే తప్పో ఒప్పో చెప్బుతుంది అని నమ్ముతాను. మొదటి నుండి అదే నమ్ముతాను.

ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు.. కానీ

OTT రిలీజ్ అని ప్రకటించగానే నా ఫ్యాన్స్ కొంత మంది బాధ పడ్డారు. కొందరు సంతోషపడ్డారు. కానీ ఎక్కువ మంది డిజప్పాయింట్ అయ్యారు. వారికి నా క్షమాపణలు. కానీ ఫ్యాన్స్ ఎప్పుడూ నా నన్ను సపోర్ట్ చేస్తూ నటుడిగా ఈ స్థాయికి తీసుకొచ్చారు. నా ఫ్యాన్స్ వండర్ ఫుల్ ఫ్యాన్స్. మొదట్లో కొంత బాధ పడ్డా తర్వాత అర్థం చేసుకున్నారు. వాళ్ళు సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.

క్లాసిక్ సినిమా.. అందుకే రీమేక్ చేశా

వెట్రిమారన్ , ధనుష్ కలిసి ఆడియన్స్ కి ఓ మంచి సినిమా అందించారు. అసురన్ ఓ క్లాసిక్ సినిమా. వండర్ ఫుల్ స్క్రిప్ట్ తో హానేస్టీగా ఓ మెసేజ్ ఇచ్చారు. యాక్షన్ తో పాటు ఎమోషనల్ డ్రామా ఉంది. చూడగానే చాలా నచ్చింది. తప్పకుండా ఇలాంటిది చేస్తే బాగుంటది.. నాకో ఛాలెంజింగ్ గా ఉంటుందనిపించింది. అందుకే ఈ రీమేక్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను నా కెరీర్ లో చాలా రీమేక్స్ చేశాను. కొన్ని సార్లు ఇక్కడ ఆ సినిమా చూడటానికి అవకాశం ఉండకపోవచ్చు. అలాంటివి కొన్ని చూసినప్పుడు వెంటనే రీమేక్ చేయాలనిపిస్తుంది. అలాంటి ఓ కథే ఈ ‘నారప్ప’.

Venkatesh new stills zeecinemalu 1
రీమేక్ …చాలా కష్టం

నిజానికి రీమేక్ చేయడం సులువు కాదు చాలా కష్టం. ఒక ఛాలెంజింగ్. అక్కడి లుక్ తో పాటు అదే ఎమోషన్ ని ఇక్కడ మన ఆడియన్స్ కి నచ్చేలా చెప్పడం చూపించడం చాలా కష్టం. ఆలాంటి కథలు తీసుకొని నా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా మార్చుకొని చేయడం పెద్ద రిస్క్. అలా చేసినప్పుడు ఇండస్ట్రీ నుండి ఫ్యాన్స్ నుండి వీడు చేసేది కరక్ట్ ఆ ? కదా ? అనే అనుమానాలు వస్తుంటాయి. ఆ టైంలో నటుడిగా నాకు ఛాలెంజింగ్ అనిపిస్తే మిగతావి పట్టించుకోకుండా చేసేస్తాను. ఒక్కొకరికి కెరీర్ అలా సూటవుతుంది. నేను కావాలని చేయలేదు. బెగినింగ్ నుండి అలా కుదిరింది.

పెద్ద ఛాలెంజ్

‘నారప్ప’ నటుడిగా నాకో పెద్ద ఛాలెంజ్. గెటప్ కానీ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి. ఇలాంటి క్యారెక్టర్ నేనిప్పటి వరకు చేయలేదు. పైగా చాలా గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ యాక్షన్ మిక్స్ అయిన సినిమా చేశాను. యాక్షన్ , ఎమోషన్ రెండూ సహజంగా ఉంటాయి. షూట్ జరిగనంత సేపు అదే డ్రెస్ తో ఉన్నాను. నటుడిగా ఇలాంటి సినిమా ఎటెంప్ట్ చేసినందుకు గర్వ పడుతున్నాను.

తనకి ఆసక్తిగా అనిపించింది.

శ్రీకాంత్ అడ్డాల సినిమా చూశాడు. తనకి చేయాలనే ఆసక్తి వచ్చింది. సో తన ఇంట్రెస్ట్ తోనే బోర్డ్ లోకి వచ్చాడు. శ్రీకాంత్ తన బాధ్యతని నిర్వర్తించి మంచి అవుట్ పుట్ తీసుకొచ్చాడు. అతను కూడా ఛాలెంజింగ్ గా తీసుకొని యాక్షన్ ఎపిసోడ్స్ బాగా షూట్ చేశాడు.

Venkatesh new stills zeecinemalu 1
కంపేరిజన్ ఉంటది

ఏ రీమేకయినా కంపేరిజన్ అనేది కచ్చితంగా ఉంటది. చంటి ..సుందరకాండ సినిమాలు చేసిన టైంలో కూడా కంపెరిజన్స్ వచ్చాయి. కానీ ఫైనల్ గా సినిమా రిలీజయ్యాక యాక్టర్ గా మంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ గుడ్ జాబ్ అన్నారు. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు నటీ నటులు కూడా కుదిరితే ఆడియన్స్ కి నచ్చుతుందని నమ్ముతా.

నేను లక్కీ అనుకుంటా

వరుసగా మూడు సినిమాలు వచ్చాయి. మూడు డిఫరెంట్ జోనర్స్. నటుడిగా నేను లక్కీ అనుకుంటున్నా. కొన్ని సార్లు అలా కుదురుతాయి. ఒకటి అయిపోగానే దాని నుండి చాలా తొందరగా బయటికొచ్చేస్తా. సో క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వడం వెంటనే దాని నుండి బయటికొచ్చేయడం మొదటి నుండి అలవాటు. అందుకే ఓకె టైం లో మూడు సినిమాలు చేయగలిగాను.

Venkatesh new stills zeecinemalu 1
మూడు ఎంజాయ్ చేశాను

ప్రెజెంట్ నేను యాక్ట్ చేసిన మూడు సినిమాలు నటుడిగా ఎంజాయ్ చేస్తూ చేశా. నారప్ప ఒక పెద్ద ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. దృశ్యం 2 మోహన్ లాల్ యాక్టింగ్ చూస్తూ బెస్ట్ నేను కూడా బెస్ట్ ఇవ్వాలని ట్రై చేశా. ఇక F3 లో నేను రెచ్చిపోతా మీ అందరికీ తెలిసిందే.

మంచి సినిమాలు చేయాలి అంతే

OTT లో మన ఆడియన్స్ ఎంత మంది చూస్తున్నారు ..? ఎక్కువ మంది చూస్తున్నారా ? లేదా ఆ ఫిగర్స్ మనకి తెలియవు.అది బిజినెస్ కిందకి వస్తుంది. నేను అవన్నే పట్టించుకోను. నటుడిగా మంచి సినిమాలు చేయాలి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి అని మాత్రమే ఆలోచిస్తాను. కానీ మార్పు ని మనం స్వాగతించాలి. తప్పదు. అది OTT అయినా మరొకటి అయినా. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనకి తెలియదు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics