‘Mr మజ్ను’లో స్పెషల్ ఎట్రాక్షన్ – సంగీత్ సాంగ్

Wednesday,January 09,2019 - 03:15 by Z_CLU

ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది ‘మిస్టర్ మజ్ను’ టీమ్. ఈ షెడ్యూల్ లో సంగీత్ సాంగ్ ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. భారీ స్థాయిలో డ్యాన్సర్స్ మధ్య సెలెబ్రేషన్ మోడ్ లో ఉండబోతున్న ఈ సాంగ్ సినిమాలో హైలెట్ కానుందని తెలుస్తుంది.

ఇప్పటి వరకు వరసగా 3 పాటల్ని రిలీజ్ చేసిన మేకర్స్, ఈ సంగీత్ సాంగ్ లిరికల్ వీడియోని త్వరలో రిలీజ్ చేసే   ఆలోచనలో ఉన్నారు. సినిమాలో ఏ సందర్భంలో ఈ సాంగ్ ఉండబోతుందనేది గెస్ చేయడం కష్టమే కానీ ‘Mr మజ్ను’ జ్యూక్ బాక్స్ లో ఈ సాంగ్ మరింత స్పెషల్ గా నిలుస్తుందని తెలుస్తుంది.

ఈ షెడ్యూల్ తో కంప్లీట్ గా షూటింగ్ ప్యాకప్ చెప్పనుంది మజ్ను టీమ్. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది Mr మజ్ను సినిమా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై B.S.V.N. ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్. తమన్ మ్యూజిక్ కంపోజర్.