మరో రికార్డు సృష్టించిన ఎఫ్2

Thursday,January 31,2019 - 01:41 by Z_CLU

వరల్డ్ వైడ్ సూపర్ హిట్ అయిన ఎఫ్2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరో రికార్డు క్రియేట్ చేసింది. కలెక్షన్ పరంగా ఏపీ, నైజాంలో ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో చోటు దక్కించుకున్న ఈ మూవీ, నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఏకంగా 60 కోట్ల షేర్ క్లబ్ లో చేరింది. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్ చూస్తే.. ఈ సినిమాకు 76 కోట్ల రూపాయలు వచ్చాయి.

తాజా వసూళ్లతో ఆల్రెడీ 60 కోట్ల క్లబ్ లో కొనసాగుతున్న బాహుబలి-2, బాహుబలి, రంగస్థలం, శ్రీమంతుడు లాంటి సినిమాల సరసన ఇప్పుడు ఎఫ్2 కూడా చేరింది. ఈ క్లబ్ లో ఎఫ్-2ది పదో స్థానం. నైజాంలో ఈ సినిమా 21 కోట్ల వసూళ్లతో దూసుకుపోతోంది.

అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పటికే 2 మిలియన్ క్లబ్ లోకి చేరిన ఈ మూవీ, లాంగ్ రన్ లో 2.5 మిలియన్ డాలర్ టచ్ చేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. మిస్టర్ మజ్ను మినహా మరో సినిమా మార్కెట్లో లేకపోవడంతో, ఈ వీకెండ్ కూడా ఎఫ్2 హంగామా కొనసాగే ఛాన్స్ ఉంది.