వెంకటేష్ బర్త్ డే గిఫ్ట్

Monday,December 05,2016 - 04:20 by Z_CLU

బాక్సింగ్ కోచ్ బర్త్ డే దగ్గరపడుతుంది. అందుకే వెంకీ ఫ్యాన్స్ దృష్టి మెల్లగా బర్త్ డే సర్ ప్రైజ్ గిఫ్ట్ పైకి మళ్ళింది. గురు సినిమా లాంచ్ అయిన దగ్గర్నించి, ఆ మధ్యెప్పుడో ఓ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయిన సినిమా యూనిట్, మళ్ళీ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ తప్ప ఇంకే అప్ డేట్ ఇవ్వలేదు.

ఇంతలో వెంకీ బర్త్ డే దగ్గర పడుతున్న కొద్దీ చిన్నగా హడావిడి మొదలుపెట్టేశారు ఫ్యాన్స్. డిసెంబర్ 13 న బర్త్ డే సెలెబ్రేట్ చేసుకోనున్న వెంకటేష్, ఫ్యాన్స్ కోసం సర్ ప్రైజింగ్ గిఫ్ట్ గా టీజర్ రిలీజ్ చేస్తాడని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మరి ఈ బాక్సింగ్ యూనిట్ మైండ్ లో ఏం నడుస్తుందో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే గాని తెలీదు.