గురు టీజర్ టాక్

Wednesday,January 11,2017 - 02:30 by Z_CLU

వెంకటేష్ గురు టీజర్ రిలీజయింది. సుధా కొంగర డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో బాక్సింగ్ కోచ్ గా మెచ్యూర్డ్ క్యారెక్టర్ లో నటించిన వెంకీ, టఫ్ఫెస్ట్ మ్యాన్ గా ఎట్రాక్ట్ చేస్తున్నాడు.

వెంకీ కరియర్ లో చాలా సినిమాల్లో ఫ్యామిలీ హీరో నటించినా, ఆంగ్రీ యంగ్ మ్యాన్ లా కనిపించిన సినిమాల కౌంట్ కూడా చాలానే ఉంది. కానీ ఈ సినిమాలో వెంకటేష్ గెటప్, క్యారెక్టరైజేషన్ చూస్తుంటే, ఈ సినిమా వెంకీ అకౌంట్ లో సం థింగ్ స్పెషల్ గా నిలవడం గ్యారంటీ అనిపిస్తుంది. ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్.