ధృవలో మెగాస్టార్...అతి త్వరలో...

Monday,December 05,2016 - 02:30 by Z_CLU

రామ్ చరణ్ ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అదిరింది. అటు రాజకీయ ప్రముఖులు, స్టార్స్ తో ఫంక్షన్ సక్సెస్ ఫుల్ అవ్వడమే కాకుండా… ధృవ సినిమా సక్సెస్ అవ్వడానికి అద్భుతమైన ప్లాట్ ఫాం కూడా క్రియేట్ అయింది. ఎక్స్ పెక్ట్ చేసిన దానికన్నా గ్రాండ్ గా జరిగిన ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఒక్క వెలితి మాత్రం స్పష్టంగా కనిపించింది.

ktr-ram-charan
ధృవ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. రానా, నవదీప్, అరవింద్ స్వామి లాంటి ప్రముఖులతో పాటు కేటీఆర్, గంటాాశ్రీనివాసరావు లాంటి రాజకీయ ప్రముఖులు కూడా వచ్చారు. కానీ ఫ్యాన్స్ అంతా ఎక్స్ పెక్ట్ చేసిన చిరంజీవి మాత్రం హాజరుకాలేదు. ఆ మెగా మిస్సింగ్ మాత్రం ఫ్యాన్స్ ను బాగా డిసప్పాయింట్ చేసింది.

dhruva-dance-making
మెగాస్టార్ మిస్సింగ్ కేవలం ఈ ఈవెంట్ కే పరిమితం కాలేదు. మొదట్నుంచి ధృవ సినిమాతో చిరంజీవి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఈ సస్పెన్స్ అంతా ఓ బిగ్ సర్ ప్రైజ్ కోసమే అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ధృవ సినిమాకు సంబంధించి దూరంగా ఉంటున్న మెగాస్టార్… ప్రమోషన్ లేదా ఆఫ్టర్ ప్రమోషన్ లో మెగా ఎప్పీయరెన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.