మొన్న బాహుబలి.. నిన్న కాటమరాయుడు.. రేపు గురు

Sunday,March 19,2017 - 01:03 by Z_CLU

బడా సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ముస్తాబవుతున్నాయి. ఎగ్జామ్స్ సీజన్ కంప్లీట్ కాగానే సినిమాలతో సందడి చేసేందుకు ప్రిపేర్ అవుతున్నాయి. బాహుబలి-2 ట్రయిలర్ ను ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా కాటమరాయుడు ట్రయిలర్ కూడా విడుదలైంది. ఇప్పుడు గురు వంతు. విక్టరీ వెంకటేష్ నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ గురు. ఈ సినిమా ట్రయిలర్ ను రేపు రాత్రి 8గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు.

సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కింది గురు సినిమా. ఇప్పటికే సూపర్ హిట్ అయిన సాలా ఖడూస్ అనే సినిమాకు రీమేక్ ఇది. రితికా సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో బాక్సింగ్ కోచ్ గా వెంకీ కనిపించనున్నాడు. ఈ సినిమాలో వెంకీ గెటప్ కు మంచి మార్కులు పడ్డాయి. దీనికి తోడు ఫస్ట్ టైం గురు సినిమాలో వెంకటేష్ ఓ పాట కూడా పాడడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వచ్చేనెలలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.