దటీజ్ సూపర్ స్టార్

Monday,December 05,2016 - 05:30 by Z_CLU

సూపర్ స్టార్ రజిని కాంత్ ఐయామ్ బ్యాక్ అంటూ సెట్ లో అందరినీ షాక్ చేశారట. రజిని ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ‘2.0’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో నిన్న రజిని కాస్త గాయపడ్డారనే వార్త చెన్నై మీడియాలో హల్చల్ చేసింది.

అయితే గాయపడిన రజిని ఈరోజు రెస్ట్ తీసుకుంటారని భావించిన యూనిట్ కు ఈరోజు ఉదయం షూట్ కి వెళ్లి అందరినీ షాక్ చేశారట రజిని. అయితే భారీ వ్యయం తో తెరకెక్కుతున్న ఈ సినిమా కావడం పైగా టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తుండడం తో తన వల్ల షూటింగ్ డిస్టర్బ్ అవ్వకూడదని భావించి కాస్త గాయపడినప్పటికీ సెట్స్ కు వెళ్లి షూటింగ్ పాల్గొన్నారట రజినీ. నిర్మాత గురించి రజిని ఇంతలా ఆలోచించి షూటింగ్ లో పాల్గొనడంతో సెట్లో అందరు రజిని ను చూస్తూ దటీజ్ సూపర్ స్టార్ అనుకున్నారట.