టాలీవుడ్ లో స్పోర్ట్స్ బేస్డ్ సినిమాల హవా

Tuesday,April 18,2017 - 03:38 by Z_CLU

వెంకటేష్ గురు సూపర్ సక్సెస్ అయింది. ఫార్ములా సినిమాల మధ్య స్పోర్ట్స్ కంటెంట్ తో బరిలోకి దిగిన వెంకీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని బ్యాగ్ లో వేసుకున్నాడు. సుధా కొంగర డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎక్స్ పెక్టేషన్స్ ని మించిన సక్సెస్ సాధించింది. అయితే ఈ సక్సెస్ తో టాలీవుడ్ లో మరిన్ని స్పోర్ట్స్ బేస్డ్ సినిమాల హవా బిగిన్ కానుందా అనిపిస్తుంది.

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మాస్ మహారాజ్ రవితేజ ‘రాజా ది గ్రేట్’ సినిమా రీసెంట్ గా రిలీజైన స్టిల్స్ ని బట్టి చూస్తే మ్యాగ్జిమం స్పోర్ట్స్ బేస్డ్ మూవీగా తెలుస్తుంది. ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కూడా గురు రేంజ్ సక్సెస్ అయితే, ఇక టాలీవుడ్ లో స్ట్రాంగెస్ట్ స్పోర్ట్స్ ట్రాక్ పడ్డట్టే.

గతంలో మహేష్ బాబు కూడా కబ్బడ్డీ స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో ‘ఒక్కడు’ సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ స్టార్ కరియర్ కే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ లా నిలిచింది. ఇక న్యాచురల్ స్టార్ నానిలో డిఫెరెంట్ ఆంగిల్ ని ప్రెజెంట్ చేసింది ‘భీమిలి కబడ్డీ జట్టు’. రీసెంట్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ట్యాగ్ ని సొంతంచేసుకున్న సాయి ధరం తేజ్ ‘విన్నర్’ కూడా స్పోర్ట్స్ బేస్డ్ ఎంటర్ టైనరే. ఇలా చెప్పుకుంటూ పోతే పర్ ఫెక్ట్ స్టోరీ లైన్ దొరకాలి కానీ, మన స్టార్స్ ఎప్పుడూ స్పోర్ట్స్ ఎంటర్ టైనర్స్ కి రెడీయే. అయితే ఈ ట్రెండ్ టాలీవుడ్ లో ఎన్నాళ్ళు కొనసాగుతుందో చూడాలి.