వరుణ్ తేజ్ సినిమాలో హైలెట్ కానున్న ఎలిమెంట్...

Thursday,April 19,2018 - 04:08 by Z_CLU

వరుణ్ తేజ్ సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో పూజా కార్యక్రమాల మధ్య బిగిన్ అయిన ఈ సినిమాకి నాగబాబు క్లాప్ కొట్టాడు. దర్శకుడు క్రిష్ గౌరవ దర్శకత్వం వహించాడు. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ స్పేస్ ఎంటర్ టైనర్ లో వరుణ్ తేజ్ ఆస్ట్రోనాట్ గా కనిపించనున్నాడు.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి తో పాటు అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటించనున్నారు. ఆస్ట్రోనాట్ గా ఆంటీ గ్రావిటీ కండిషన్ లో ఎలా మ్యానేజ్ చేయాలో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు వరుణ్ తేజ్. పక్కా పకడ్బందీగా ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుని ఈ రోజు సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమాలో సంకల్ప్ రెడ్డి మార్క్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో పాటు వాటిని ఎలివేట్ చేసే VFX హైలెట్ కానున్నాయి.

 

భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, సాయిబాబు, క్రిష్  సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్. విహారి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.