కొరటాల శివ ఇంటర్వ్యూ

Thursday,April 19,2018 - 03:11 by Z_CLU

రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ‘భరత్ అనే నేను’. ఈ నెల 20 న గ్రాండ్ గా రిలీజవుతున్న ఈ సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ దగ్గరి నుండి, ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు దర్శకుడు కొరటాల. అవి మీకోసం…

కైరా అద్వానీ చాలా స్పెషల్…

కైరా అద్వానీకి సినిమా పట్ల ఎంత డెడికేషన్ అంటే డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కి 2 రోజులు ముందే కాల్ చేసి నా లైన్స్ నాకు ముందే పంపించండి, నేను మళ్ళీ మహేష్ బాబు గారితో చేసేటప్పుడు  ఇబ్బంది పడకూడదు, అని ముందు నుండే ప్రిపేర్డ్ గా ఫోకస్డ్ గా ఉండేది. అందుకే దానయ్య గారు ఇంప్రెస్ అయిపోయి తన నెక్స్ట్ సినిమాలో చాన్స్ ఇచ్చారు.

 

చాలా తేలికైంది…

పొలిటికల్ సినిమా ఆనగానే చాలా పెద్ద కాన్వాస్, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నా నాకేమీ ఇబ్బంది కాలేదు. పోసాని కృష్ణ మురళి , ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, సితార గారి లాంటి సీనియర్ ఆక్టర్స్ ఎంత కోఆపరేట్ చేశారంటే నా పని చాలా తేలికైంది.

ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారు…

సినిమాకి పని చేసిన ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి సీన్ లో రియల్ అట్మాస్ఫియర్ చేయడానికి ఆయన రీసర్చ్ చేసి మరీ చేసేవాడు. చిన్న పోలీస్ కానిస్టేబుల్ ఇల్లు సెట్ కోసం 1 మంత్ రీసర్చ్ చేశారు. అసెంబ్లీ సెట్ కోసం 6 నెలలు, ఇలా ప్రతీది రీసర్చ్ చేసి మరీ పర్ఫెక్ట్ గా ఎలివేట్ అయ్యేలా చేశారు.

 

దానయ్య గారి మాట…

దానయ్య గారు కనీసం మొత్తం స్టోరీ కూడా వినలేదు. జస్ట్ లైన్ తెలుసంతే… సినిమా బిగిన్ అయినప్పటి నుండి ఆయన అన్న మాట ఒకటే… ‘సార్.. నాకు రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా కావాలి..’ అంతే. అది తప్ప బడ్జెట్ విషయంలో కానీ, షూటింగ్ విషయంలో కానీ ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మేము ఏది అడిగితే అదీ.. కాదనకుండా అరేంజ్ చేశారు. అందుకే సినిమా కూడా అంత అద్భుతంగా వచ్చింది.

శ్రీకర్ గారు అద్భుతమైన ఎడిటర్…

నేను మహేష్ బాబు గారికి చెప్పిన కథ మొత్తం 4 గంటల సినిమా అవుతుంది. ప్రతీది షూట్ చేశాం. దాన్ని శ్రీకర్ గారు సినిమాను షార్ప్ చేసిన తీరు అద్భుతం.