నా పేరు సూర్య ‘బ్యూటిఫుల్ లవ్’ 1 మినట్ వీడియో

Thursday,April 19,2018 - 04:56 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన నా పేరు సూర్య థర్డ్ సింగిల్ ‘బ్యూటిఫుల్ లవ్’ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బన్ని, అనూ ఇమ్మాన్యువెల్ కాంబినేషనల్ లో ఉండబోయే ఈ సాంగ్, అద్భుతంగా తెరకెక్కింది అంటున్నారు ఫిల్మ్ మేకర్స్. అందుకే ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసేందుకు రేపు సాయంత్రం 5:30 కి ఈ సాంగ్ 1 మినట్ వీడియోని రిలీజ్ చేయనున్నారు నా పేరు సూర్య టీమ్.

మే 4 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా సోషల్ మీడియాలో ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ నెల 22 న మిలిటరీమాధవరం లో గ్రాండ్ గా ఆడియో లాంచ్ ని జరుపుకోనున్న ఫిల్మ్ మేకర్స్, అదే రోజు ఈ సినిమా జ్యూక్ బాక్స్ ని కూడా రిలీజ్ చేయనున్నారు.

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్  ప్రాసెస్ లో ఉంది. యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో అనూ  ఇమ్మాన్యువెల్ హీరోయిన్. విశాల్- శేఖర్ మ్యూజిక్ కంపోజర్స్.